ప్రతి ఒక్కరూ విద్యను నేర్చుకోవాలంటే మొదట పలక, బలపం పట్టాల్సిందే. కానీ చిన్నారులు తెలిసి తెలియని వయసులో పాఠశాలకు వచ్చి తెలియకుండానే బలపం తింటారు. ఇలా బలపం తినడం వలన అనారోగ్య సమస్యలు వస్తాయి. ఒక వేల ఇదే అలవాటుగా మారితే కొన్నిసార్లు తీవ్ర అనారోగ్యం బారినపడి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
అయితే ఇదంతా సుద్దతో తయారు చేసిన చాక్ పిస్ తినడం మూలంగా జరుగుతుందన్న విషయం తెలిసిందే. దీనితో పెద్దపల్లి జిల్లా గోదావరిఖని జెడ్పిహెచ్.ఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు తమ ఆలోచనలకు పదును పెట్టి పోషక విలువలతో కూడిన చాక్ పిస్ తయారు చేయడంతో..ఇప్పుడు వారిని జాతీయ స్థాయిలో ప్రత్యేకంగా నిలిపేలా చేసింది.
కాగా గత జనవరిలో జాతీయ స్థాయి సైన్సు కాంగ్రెస్ ను దేశ ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా ప్రారంభించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి చాల మంది విద్యార్థులు తమ తమ ప్రాజెక్ట్, మోడల్స్ తో హాజరు కాగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాటశాల బాలికలు ప్రదర్శించిన ఓవర్ కంమింగ్ ఫ్రమ్ పైక డిసార్డర్ అఫ్ ఈటింగ్ స్లేట్ పెన్సిల్ మోడల్ అందరిని ఆకట్టుకుంది.
నిత్యజీవితంలో ప్రతి ఒక్క చిన్నారికి ఎదురయ్యే సమస్య అయినప్పటికీ దానికి పరిష్కార మార్గం చూపడం ఈ విద్యార్థులతో పాటు గైడ్ టీచర్ సునీత పాటశాల రాష్ట్ర స్థాయిలో ప్రత్యేకంగా నిలిపింది. జాతీయ స్థాయిలో పాల్గొనడం తో జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ జిల్లా విధ్యాదికారి మాధవి పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులను అభినందించారు.
విద్యార్థులు జాతీయ స్థాయి నేషనల్ సైన్సు కాంగ్రెస్ లో పాల్గొని అందరితో ప్రశంసలు పొందడం చాల గర్వంగా ఉన్నట్లు పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయురాలు లూర్దు మేరి తెలిపారు. "నా చిన్న చెల్లె తరచుగా కడుపునొప్పితో బాధపడుతూ ఉండేది. దీనిని మా టీచర్ దృష్టికి తీసుకరావడంతో దానికి కారణం చాక్ పీస్ తినడం అని తెలిసింది. ఆ విదంగా తనకు ఈ ఆలోచన వచ్చిందని" విద్యార్థిని హరిప్రియ చెప్పుకొచ్చింది.
తన స్నేహితురాలుతో కలిసి ఆరోగ్యంగా ఉండటానికి ఏదైనా చేయాలని తమ టీచర్ సహకారంతో పోషక విలువలు కలిగిన చాక్ పీస్ ను తయారు చేసినట్లు విద్యార్థిని హరిప్రియ తెలిపింది. ఈ పోషక విలువలు గల చాక్ పీస్ తయారు చేయడానికి. కొన్ని డ్రై ఫ్రూట్స్, నువ్వుల పొడి, పల్లీల పొడి , బియ్యం పిండి ,చక్కర అవసరాన్ని బట్టి బెల్లంను ఉపయోగించి తినే చాక్ పీస్ ను తయారు చేయవచ్చు.
ముందుగా అవసరాన్ని బట్టి ఇతర పదార్థాలను తీసుకొని చక్కర పానకంలా చేసి దానిలో నువ్వులు, పల్లి పిండి, బియ్యం పిండి కలిపి ఈ మిశ్రమమాన్ని ఒక తాంబూలం లాంటి ప్లేట్ లో తీసుకోవాలి. ఆ తరువాత చల్లారక ముందు చేతితో సాగాతీయడం వలన బలపాల ఆకారం వస్తుంది. దీనిని మాములుగా పలక పై వ్రాయడం తో పాటు తినవచ్చు అని మరొక విద్యార్థిని హరిప్రియ తెలిపారు.