అధినేత, సీఎం కేసీఆర్ అచ్చమైన నిరంకుశుడిగా వ్యవహరిస్తున్నారని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆరోపించారు. కొడుకు కేటీఆర్ ను ఆ తర్వాత మనవడు హిమాన్షును సీఎం చేయడమే కేసీఆర్ లక్ష్యమని విమర్శించారు. ఆర్టికల్ 370ని రద్దు చేసినట్లే తెలంగాణలో నిజాం, నయా నిజాం అసదుద్దీన్ ఓవైసీ వారసత్వానికి బీజేపీ చరమగీతం పాడుతుందన్నారు అస్సాం సీఎం.
మొఘల్ పాలకుడు బాబర్ తరహాలోనే అధినేత అసదుద్దీన్ ఓవైసీ కథ కూడా త్వరలోనే ముగుస్తుందని, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇంకెంతో కాలం ఓవైసీలపై ఆధారపడలేడని అస్సాం సీఎం అన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా మొఘలుల్ని గౌరవిస్తే ముస్లింలు ఓట్లేస్తారని భావించిందని, ఆ విషయాన్ని అర్థం చేసుకున్న ప్రజలు కాంగ్రెస్ కు బుద్ది చెప్పారని బిశ్వ శర్మ అన్నారు.
సీఎం కేసీఆర్ కు ఒకే ఒక్క లక్ష్యం ఉందని, ముందుగా తన కొడుకు, ప్రస్తుత మంత్రి అయిన కేటీఆర్ ను తెలంగాణ ముఖ్యమంత్రిగా చేయడం, ఆ తర్వాత తన మనవడికీ ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించాలన్నదే కేసీఆర్ ఏకైక లక్ష్యమని అస్సాం సీఎం ఆరోపించారు. ఎవరికివాళ్లు వారసులను సీఎంలుగా చేసుకుంటూ పోతే ఈ దేశం నడిచేదెలా? అని హిమంత వాపోయారు.