కరోనా పని ఇక అయిపోయిందని అంతా రిలాక్స్ అవుతున్న సమయంలో మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. టెన్షన్ పుట్టుస్తోన్న కొత్త వేరియంట్ మన దేశంలోకి సైతం ప్రవేశించడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే దేశంలో 4 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయని అధికారికంగా ప్రభుత్వం ప్రకటించింది.(ప్రతీకాత్మక చిత్రం)
అయితే ఒకే అపార్ట్మెంట్ లో పది కేసులు నమోదవడంతో స్థానిక వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. అపార్ట్మెంట్లో శానిటైజేషన్ నిర్వహించారు. అపార్ట్మెంట్ వాసులకు కౌన్సెలింగ్ ఇచ్చి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు. రేపు అపార్ట్మెంట్ లో అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.(ప్రతీకాత్మక చిత్రం)
అయితే కరోనా సోకిన పది మంది ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అధికారులు వారిని హోం ఐసోలేషన్ లో ఉంచి వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు. రేపటి కల్లా ఈ ప్రాంతంలో మొత్తం ఎన్ని కరోనా కేసులు వచ్చాయన్న అంశంపై స్పష్టమైన లెక్క వచ్చే అవకాశం ఉంది.(ప్రతీకాత్మక చిత్రం)
ఇదిలా ఉంటే దేశంలో నాలుగో ఒమిక్రాన్ కేసు తాజాగా నమోదైంది. దక్షిణాఫ్రికా (South Africa)లోని కేప్ టౌన్ నుంచి దుబాయ్ - ఢిల్లీ మీదుగా మహారాష్ట్రలోని ముంబైకి తిరిగి వచ్చిన 33 ఏళ్ల వ్యక్తికి కరోనా వైరస్ యొక్క ఓమిక్రాన్ వేరియంట్ సోకినట్లు పరీక్షల్లో తేలింది. ప్రయాణికుడు కళ్యాణ్-డోంబివాలి మునిసిపల్ ప్రాంతంలో నివసిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అతను ఇప్పటివరకు కరోనా వ్యాక్సిన్ తీసుకోకపోవడం గమనార్హం.(ప్రతీకాత్మక చిత్రం)
అతనితో పాటు ప్రయాణించిన 12మంది హై-రిస్క్ కాంటాక్ట్లుగా, మరో 23 మందిని తక్కువ రిస్క్ ఉన్న కాంటాక్ట్ లుగా అధికారులు గుర్తించారు. అయితే వారందరికీ పరీక్షలు నిర్వహించగా నెగటీవ్ గా తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వ్యక్తి ఇంకా ఎంత మందిని కలిశాడు? అన్న వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)