ప్రస్తుతం హెచ్ పీసీఎల్ డిపోలో పెట్రోల్ నిల్వలు తక్కువగా ఉండటం వల్లే ఈ పరిస్థితి నెలకొందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. పెట్రోల్, డీజిల్ కోసం బంకు యజమానులు ముందస్తుగా సొమ్ము చెల్లిస్తుంటారు. సాధారణానికి భిన్నంగా కొన్ని రోజులుగా సొమ్ము చెల్లించిన నాటి నుంచి ఒకటిన్నర, రెండు రోజుల సమయం పడుతోంది. ఈలోగా బంకుల్లో నిల్వలు నిండుకుంటున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
కాగా, బంకుల్లో నో స్టాక్ బోర్డులు, సరఫరాలో జాప్యం అనుమానాలపై హెచ్ పీసీఎల్ అధికారులు స్పందించారు. ఇప్పటి వరకు అందిన ఆర్డర్ల మేరకు సరఫరా చేశామరి వారు చెప్పారు. అయితే, ప్రస్తుతం ఘట్ కేసరస్ డిపోల్లో పెట్రోల్, డీజిల్ అన్ లోడ్ ప్రక్రియ సాగుతోందని, బుధవారం నుంచి మళ్లీ సరఫరా ప్రారంభిస్తామరి వారు పేర్కొన్నారు.(ప్రతీకాత్మక చిత్రం)