Sick village : ఆ జబ్బుతో ఊరి జనం పేషెంట్లుగా మారుతున్నారు .. ఎందుకో తెలియక చనిపోతున్నారు
Sick village : ఆ జబ్బుతో ఊరి జనం పేషెంట్లుగా మారుతున్నారు .. ఎందుకో తెలియక చనిపోతున్నారు
Sick village: ఆ తండాకు జబ్బు పట్టింది. నూరేళ్లు బతకాల్సిన ఆ తండా వాసులు ఆర్ధాయుష్షుతో ఆసువులు బాస్తున్నారు. కొందరు క్యాన్సర్ బారిన పడి మృతి చెందగా.. మరికొందరు మూత్ర పిండాల వ్యాధితో నరకయాతన పడుతున్నారు. ఎందుకిలా జరుగుతుందో ఎవరికి అర్ధం కావడం లేదు.
ఆ తండాకు జబ్బు పట్టింది. నూరేళ్లు బతకాల్సిన ఆ తండా వాసులు ఆర్ధాయుష్షుతో ఆసువులు బాస్తున్నారు. కొందరు క్యాన్సర్ బారిన పడి మృతి చెందగా.. మరికొందరు మూత్ర పిండాల వ్యాధితో నరకయాతన పడుతున్నారు.
2/ 14
కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గుజ్జల్ తండాలో పచ్చని చేట్లు, చుట్టూ ఎత్తైన కొండలు.. అక్కడక్కడా విసిరేసినట్లు ఉండే అవాసాలు. పచ్చదనం మధ్య బతికే గిరి పుత్రులను ఈ విచిత్రమైన వ్యాధులు వెంటాడుతున్నాయి.
3/ 14
నిండు నూరేళ్లు బతకాల్సిన తండా వాసులను అర్ధాయుష్షులుగా మారి తనువు చాలిస్తున్నారు. కేవలం వేయి జనాభా ఉన్న ఈ తండాలో గిరిపుత్రులు ఒక్కొక్కరుగా మంచాన పడటం, నెలల వ్యవధిలోనే మృత్యు ఒడికి చేరుతున్నారు.
4/ 14
ప్రస్తుతం ఇంటి కొకరు చొప్పున కిడ్నీ, క్యాన్సర్ వంటి వ్యాధి బాధితులు ఉన్నారు. ఇలాంటి వ్యాధి తండాను ఎందుకు పట్టి పీడిస్తుందో తెలియక.. గ్రామస్ధులు భయంతో వణికిపోతున్నారు... దశాబ్ద కాలంగా క్యాన్సర్, కిడ్ని సంబంధిత వ్యాధితో పదుల సంఖ్యలో గిరి పుత్రులు మృత్యువాత పడ్డారు.
5/ 14
ఎందుకు ఇంతటి ప్రాణాంతక వ్యాధి పీడిస్తుందో ..దీనికి వైద్యం ఎలా తీసుకోవాలో తెలియక తండా వాసులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. కనీసం ఊరిలో జనం ఎందుకిలా అనారోగ్యం పాలవుతున్నారని పట్టించుకునే అధికారులు, పాలకులు కరువయ్యారు.
6/ 14
కామారెడ్డి జిల్లా కేంద్రానికి 35 కిలోమీటర్ల దూరంలో ఈ తండా వాసులు క్యాన్సర్ బారిన పడి ఇప్పటి వరకు 12 మంది మృత్యువాత పడగా.. 40 మంది కిడ్ని సంబంధిత వ్యాధితో ప్రాణాలతో పోరాడుతున్నారు.
7/ 14
అనారోగ్యానికి కారణాలేంటో తెలియక భయంతో అధికారుల చుట్టు తిరిగినా పట్టించుకోవడం లేదని.. తండా వాసులు ఆవేదన చెందుతున్నారు. ప్రతీ ఇంటికి ఓ క్యాన్సర్ బాదితులు లేకపోతే.. కిడ్ని బాదితులు ఉన్నారని గిరి పుత్రులు ఆవేదన చెందుతున్నారు.
8/ 14
అంతు చిక్కని వ్యాధి సోకిందని.. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వణికిపోతున్నారు. ఇదే విషయమై ఇటీవల తండా వాసులు గ్రివెన్స్ సెల్లో జిల్లా కలెక్టర్కు కూడా ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం శూన్యమంటన్నారు తండావాసులు.
9/ 14
గుజ్జల్ తండాలో చాలామందికి మూత్రపిండాలు చెడిపోవడం, క్యాన్సర్ రావడం, ప్లేట్లెట్స్ కౌంట్ పడిపోవడం, తెల్ల రక్త కణాలు పడిపోవడం ఇలా జరుగుతోందని తండావాసి పండారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
10/ 14
అంతే కాదు ఈ వింత వ్యాధి నుంచి బయటపడేందుకు గడిచిన రెండు నెలలుగా ఒక్కొక్క ఇంట్లో నుంచి 70 నుంచి 80వేల రూపాయలు ట్రీట్మెంట్ పేరుతో ఆసుపత్రులకు ఖర్చు చేశామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
11/ 14
గ్రామస్తుడు పండారి తండ్రిని యాశోద ఆసుపత్రిలో చేర్పిస్తే వైద్యానికి 12 లక్షల రూపాయల ఖర్చయింది. ఒక ఎకరం వ్యవసాయ భూమి అమ్ముకునే పరిస్థితి వచ్చింది. అసలు ఈ వ్యాధి ఎందుకు వస్తుంది.. ఏంటి అనేది మాకు అర్థం కావడం లేదంటున్నాడు.
12/ 14
రెండు విచిత్రమైన వ్యాధులతో ఊరంతా వల్లకాడుగా మారుతుంటే ఉన్నతాధికారులు, వైద్యాధికారులు ఎవరూ తండాకు కూడా రావడం లేదు. మమ్మల్ని పట్టించుకోవడం లేదంటున్నారు. ఒకరిద్దరు వచ్చి చూసిపోతున్నారు తప్ప ఏం చేయడం లేదంటున్నారు.
13/ 14
ఈ అనారోగ్య సమస్య తాగు నీటి వలన కలుగుతోందా లేక మరేదైనా సమస్య ఉందా అనే విషయాలపై అధ్యాయనం చేసి తమకు చెప్పాలని కోరుతున్నారు. మమ్మల్ని పట్టించుకోవాలని మా ఊరికి ఊపిరి పోయాలని.. తండా వాసులు అధికారులను వేడుకుంటున్నారు.
14/ 14
అంతు చిక్కని వ్యాధితో ఆసువులు బాస్తున్నా.. పట్టించుకోకపోవడంపై ఆవేదన చెందుతున్నారు గుజ్జల్ తండాలోని ప్రజలు. ఇప్పటికైనా అధికారులు ఆ తండాలో ఆర్ధాయుష్షుతో ఆసువులు బాస్తున్న వైనంపై దృష్టి సారించి అంతు చిక్కని మరణాల నిగ్గు తేల్చాలని స్థానికులు కోరుతున్నారు.