Nizamabad : కారులో వెళుతున్న ఇద్దరు యువకులు కాలి బూడిదైపోయారు.. ఆ అర్ధరాత్రి ఏం జరిగిందో తెలుసా
Nizamabad : కారులో వెళుతున్న ఇద్దరు యువకులు కాలి బూడిదైపోయారు.. ఆ అర్ధరాత్రి ఏం జరిగిందో తెలుసా
Nizamabad : నిజామాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు సజీవదహనం అయ్యారు. అర్ధరాత్రి సమయంలో రోడ్డుపై ఆపిన లారీని చూసుకోకుండా ఢీకొట్టడంతో స్పాట్లో మృతి చెందారు. కారులో మంటలు వ్యాపించడంతో కారు పూర్తిగా కాలిపోయింది.చనిపోయిన ఇద్దరూ జగిత్యాల జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు.
పాతికేళ్ల వయసున్న యువకులు ఇద్దరు ..కారులో ప్రయాణిస్తూ కాలి బూడిదైపోయారు. గుర్తు పట్టలేనంతగా మృతదేహాలు కాలిపోయాయి. నిజామాబాద్ జిల్లాల్లో ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సజీవదహనమయ్యారు.
2/ 10
నిజామాబాద్ జిల్లా వేల్పూర్ జాతీయ రహదారి పడిగేల్ ఎక్స్ రోడ్డు దగ్గర రోడ్డు పక్కన ఆగివున్న లారీని ఓ వైట్ కలర్ ఆల్టో కారు ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో కారులో ఉన్న సుమంత్, అనీల్ అనే ఇద్దరు యువకులు సజీవ దహనమయ్యారు.
3/ 10
ప్రమాదంలో చనిపోయిన ఇద్దరు యువకులు జగిత్యాల జిల్లా కోరుట్లకు సుమంత్, మెట్పల్లి మండలం వెల్లుట్ల గ్రామానికి చెందిన అనిల్‌గా గుర్తించారు. సుమంత్ డయాలసిస్ టెక్నిషన్‌గా పనిచేస్తున్నాడు.
4/ 10
తెల్లవారు జామున ఒంటి గంట ప్రాంతంలో మెట్పల్లి నుంచి ఆర్మూర్ వైపు వస్తున్న కారు బ్రేక్ డౌన్ కారణంగా రోడ్డుపై పార్క్ చేసిన లారీని ఢీకొట్టింది. చీకటి కావడంతో రోడ్డుపై లారీ ఉన్నట్లుగా కనిపించకపోవడంతో ప్రమాదం జరిగింది.
5/ 10
కారు ముందు భాగం పూర్తిగా నుజ్జు నుజ్జు అయింది. లోపలున్న సుమంత్, అనీల్ కారులో ఇరుక్కుపోయారు. వెంటనే మంటలు అంటుకోవడంతో బయటపడే దారిలే కారు లోపలే మంటల్లో సజీవదహనం అయ్యారు.
6/ 10
అర్ధరాత్రి సమయంలో ప్రమాదం జరగడం.. ఆ సమయంలో అటుగా ఏ వాహనాలు పెద్దగా తిరగకపోవడంతో కారు మంటల్లో కాలిపోయింది. ఉదయం 2గంటల సమయంలో ఎవరూ చూసి డయల్ 100కి ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు.
7/ 10
రోడ్డు ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న వేల్పూర్ పోలీసులు స్పాట్‌కి చేరుకున్నారు. అప్పటికే కారు పూర్తిగా కాలిపోయి ఉండటం...ముందు భాగం పూర్తిగా నుజ్జు నుజ్జు అయింది. ఇక కారులో చనిపోయిన ఇద్దరు యువకుల మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి.
8/ 10
కారులో చిక్కుకొని సజీవ దహనమైన సుమంత్, అనీల్ మృతదేహాలను బయటకు తీయడానికి పోలీసులు చాలా సేపు శ్రమించారు. విషయాన్ని మృతుల కుటుంబ సభ్యులకు తెలియజేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
9/ 10
రోడ్డు ప్రమాదం జరిగిన తీరు..కారులోని యువకుల మృతదేహాలను చూసిన స్థానికులు భయపడిపోయారు. అయితే మృతులు చివరి సారిగా ఎవరితోనైనా మాట్లాడారా అనే విషయం కూడా తెలియరాలేదు.
10/ 10
రోడ్డు ప్రమాదం జరగడానికి లారీ డ్రైవర్ కూడా ఒక కారణమని పోలీసులు తెలిపారు. రోడ్డు పక్కకు ఆపి ఇండికేటర్స్ ఆన్ పెట్టకపోవడం వల్లే ఇంత ఘోర ప్రమాదం జరిగిందన్నారు. లారీ డ్రైవర్‌పై కూడా కేసు నమోదుచేశారు వేల్పూరు పోలీసులు.