Anasuya| Nizamabad: జబర్దస్త్ కామెడీ షో ద్వారా తెలుగువారికి బాగా దగ్గరైన యాంకర్ అనసూయ నిజామాబాద్‌లో సందడి చేసింది. వరుస సినిమా ఆఫర్లతో బిజీ ఆర్టిస్ట్‌గా మారిన తర్వాత ఆమె ఓ సెలబ్రిటీగా మారిపోయారు. ఓ పట్టు చీరల షోరూంను ప్రారంభించారు.
జబర్దస్త్ కామెడీ షో ద్వారా తెలుగువారికి బాగా దగ్గరైన యాంకర్ అనసూయ నిజామాబాద్‌లో సందడి చేసింది. వరుస సినిమా ఆఫర్లతో బిజీ ఆర్టిస్ట్‌గా మారిన తర్వాత ఆమెకు సెలబ్రిటీగా మారిపోయారు.
2/ 14
అందుకే నిజామాబాద్ నగరంలోని పట్టు చీరల వస్త్ర ప్రపంచంగా ఆకృతి షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి షోరూంను ప్రారంభిచారు అనసూయ. బ్లూ కలర్ పట్టు చీరలో సినీ నటి అదిరిపోయే ఫోటోషూట్ చేసింది.
3/ 14
పట్టు చీరలు అంటే తనకు చాలా ఇష్టమన్న అనసూయ మాస్టర్ వీవర్స్ శారీ షోలో భాగంగా నిజామాబాద్ జిల్లాకు వచ్చింది. వంద మంది మాస్టర్స్ వారి మగ్గాలపై ప్రత్యేకంగా తయారు చేసిన చీరల షో ఉంది.
4/ 14
అదే సమయంలో నిజామాబాద్‌లో నూతనంగా ప్రారంభించబడిన ఆకృతి షాపింగ్ మాల్లోని తామర, కీమయ, విభావరి వంటి రకాల పట్టు చీరలను అనసూయ ప్రదర్శించారు. స్వయంగా ఆమె వేసుకొని చూసి ముచ్చటపడ్డారు.
5/ 14
కామెడీ షో యాంకర్‌గానే కాకుండా, సినిమాల్లో నటిస్తూ బాగా పాపులారిటీ సంపాధించుకుంది అనసూయ. అనసూయ విచ్చిన విషయం తెలియగానే ఆమెను చూసేందుకు నగరంలోని జనాలు పెద్ద ఎత్తున షోరూం దగ్గరకు చేరుకున్నారు.
6/ 14
1953 నుంచి చీరల వ్యాపారం చీరలోకి వచ్చిన కిషన్ సంస్థ మహిళలకు కొత్త కొత్త డిజైన్లలో పట్టు చీరలను అందిస్తున్నట్లు అనసూయ తెలిపారు. నాకు సారీస్ అంటే చాలా ఇష్టమన్న జబర్దస్త్ యాంకర్ ఇక్కడ షోరూలో ఉన్న అనేక డిజైన్స్ పట్టు చీరలను చూస్తుంటే ఆనందంగా ఉందన్నారు అనసూయ.
7/ 14
నిజామాబాద్‌లోని ఆకృతి షోరూంలో మూడు బ్రాండ్స్‌ను లాంచ్ చేసినట్లుగా అనసూయ చెప్పారు.ఇక్కడ ధరలు కూడా అందరికీ అందుబాటులో ఉండే రకంగా తయారు చేశారని చెప్పారామె. విభావరి పట్టు చీర చాలా రిచ్ గా ఉందని చుట్టుకొని మరీ చెప్పారు.
8/ 14
తొమ్మిది వేల నుంచి 15 వేల రూపాయల మధ్యలో పట్టుచీరలు ఉన్నాయి. రంగు రంగుల మ్యాచింగ్ కలర్స్ అందుబాటులో ఉంచారని అనసూయ తెలిపారు. ఎవరీ బడ్జెట్లో వారికి అందుబాటులో నూతనంగా తీసుకువచ్చిన బ్రాండ్స్ చాలా బాగున్నాయి.
9/ 14
ముందుగా షోరూంను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన అనసూయ అటుపై పట్టుచీరల షోరూంలో దేవుని ప్రతిమలకు పూజ చేసి పట్టు మూడు తామర, కీమయ, విభావరి వంటి కొత్త బ్రాండ్ పట్టుచీరలను ప్రదర్శించారు.
10/ 14
తామర బ్రాండ్ పట్టుచీరలు 25వేల రూపాయల స్టార్టింగ్ ధర ఉన్నట్లుగా తెలిపారు. కిమయ ప్యూర్ ధర్మవరం పట్టు డిజైనింగ్ శారీస్, విభావరి రకం పట్టు చీరలు అందరికీ అందుబాటులో ఉన్నట్లుగా అనసూయ చెప్పారు.
11/ 14
రంగస్తలం, పుష్ప సినిమాలతో బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయింది అనసూయ. అందుకే ఈ సినీ నటి సిటీకి వచ్చిందని తెలియడంతో అభిమానులు ఆమెను చూసేందుకు మాట్లాడేందుకు పోటీ పడ్డారు. షోరూంను ప్రారంభించిన అనంతరం ఆమె అందర్ని పలకరించారు.
12/ 14
మనం ఫంక్షన్స్ కి వెళ్ళిన.. పండగలకు వచ్చిన ఎలాంటి వాటికైనా చాలా అందంగా ఉండే విదంగా చీరలు తయారు చేశారు.. ఇవి చూస్తుంటే చాలా ఆనందం వేసింది .. మూడు రోజులకు స్పెషల్ డిస్కౌంట్ కూడా ఉన్నాయి అన్నారు.
13/ 14
నీలి రంగు పట్టుచీరలో సిల్వర్ కలర్ టచప్‌తో ఉన్న శారీలో యాంకర్ కమ్ సినీ నటి అనసూయ తన అంద, చందాలను ఒలకబోశారు. తన ట్రెడిషనల్ లుక్కుతో అక్కడికి వచ్చిన వారిని ఫిదా చేసింది అనసూయ.
14/ 14
అనసూయ టీవీ షోతో ప్రేకకుల్ని సినిమాలతో కుర్రాళ్లను అభిమానులుగా చేసుకుంది. సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక పోస్ట్ లు పెడుతూ అందరితో తన అప్డేట్స్ని షేర్ చేసుకుంది.