ప్రతి ఒక్కరు పోష్టికరమైన ఆహారాన్ని మితంగా తీసుకోవాలి అని తెలిపారు. ప్రతి తల్లి తన పిల్లలకు ముర్రు పాలను ఇవ్వాలన్నారు. ముర్రు పాలు పిల్లలకు అమృతం లాంటివని తాను కూడా తన తల్లి పాలు నాలుగేళ్లు తాగినట్లు చెప్పారు. తల్లిపాలు తాగిన ప్రతి బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని స్పీకర్ చెప్పారు. తల్లి పాలు పిల్లల ఆరోగ్యానికి ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని పెంచడానికి పని చేస్తుందన్నారు.