కాని ఇక్కడ నాణ్యమైన భోజనం పెట్టాలంటే ఒక్కో స్టూడెంట్‌కి మెస్ చార్జీలు 2,200 లకు పెంచితేనే ఇచ్చే పరిస్థితి నెలకొంది. ఇక ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ సొంత నియోజకవర్గంలోనే యూనివర్సిటీ ఉన్నప్పటికి బస్సు సౌకర్యం కూడా లేదని స్టూడెంట్స్ మండిపడుతున్నారు. ఏదైనా అనారోగ్య సమస్య వస్తే చూడటానికి కనీసం ఒక్క డాక్టర్ కూడ లేరంటున్నారు స్టూడెంట్స్.