లక్ష్మణుడు లేని రామాలయం ఇదొక్కటే..మీరు చూశారా? ఎక్కడుందంటే?
లక్ష్మణుడు లేని రామాలయం ఇదొక్కటే..మీరు చూశారా? ఎక్కడుందంటే?
రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు ఎక్కడా..ఏ రామాలయంలో చూసినా ఈ నలుగురు ఉండడమే రామాలయ ప్రత్యేకత. ఇక రామాయణంలోని ఘట్టాన్ని పరిశీలిస్తే జననం మొదలుకుని పట్టాభిషేకం వరకు లక్ష్మణుడు రాముణ్ణి విడిచి ఉండలేదన్నది చరిత్ర చెప్తోంది. కానీ లక్ష్మణుడు లేని రామాలయం మీరు చూశారా? ఎక్కడుందో తెలుసా? P.Mahendar,News18,Nizamabad
రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు ఎక్కడా..ఏ రామాలయంలో చూసినా ఈ నలుగురు ఉండడమే రామాలయ ప్రత్యేకత. ఇక రామాయణంలోని ఘట్టాన్ని పరిశీలిస్తే జననం మొదలుకుని పట్టాభిషేకం వరకు లక్ష్మణుడు రాముణ్ణి విడిచి ఉండలేదన్నది చరిత్ర చెప్తోంది.
2/ 14
అదే ఇంతకాలం మనందరికీ తెలుసు. కానీ నిజామాబాద్ జిల్లాలో లక్ష్మణుడు లేకుండానే సీతా సమేతంగా శ్రీరాముడికి ఆలయం ఉంది. ఇక్కడ లక్ష్మణుడు లేకుండానే శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతుండటం విశేషం.
3/ 14
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నిన్న శ్రీరామనవమి కళ్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి.
4/ 14
మూడు మూర్తులుగా వెలసిన బుజ్జా గంబుల మూలమూర్తికి పట్టువస్త్రాలు. ముత్యాల తలంబ్రాలతో కన్నుల పండవగా స్వామి వారి కళ్యాణం జరిగింది.
5/ 14
వేకువజాము నుంచే భక్తులు రామాలయాలకు రావడంతో ఆలయాన్ని శ్రీరామ నామ స్మరణతో మారుమోగాయి. ఎల్లప్పుడు రాముడికి తోడు నీడగా ఉండే లక్ష్మణుడు లేకుండానే నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి గ్రామంలో రామాలయం ఉంది.
6/ 14
మిగతా ఆలయాలతో పోలిస్తే ఈ రామాలయానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ ఆలయంలో లక్ష్మణుడు లేకుండానే హనుమంతుడు సీత సమేతంగా శ్రీరాముడు కొలువుదీరాడు.
7/ 14
ఒకసారి ఈ ఆలయం చరిత్రను పరిశీలిస్తే సుమారు రెండు వందల ముప్పై సంవత్సరాల క్రితం రెడ్డి రాజుల కాలంలో శ్రీమతి శీలం జానకి బాయి వంశీయులు నిర్మించినట్టు చరిత్ర ఆధారాలు చెబుతున్నాయి..
8/ 14
అంతేకాకుండా కాశీ చరిత్ర అనే పుస్తకంలో ఏనుగుల వీర స్వామి అనే సుప్రీంకోర్టు జడ్జి మద్రాసు నుంచి కాశి యాత్రగా వెళ్తూ 1830 జూలై 22వ తేదీన ఇందల్వాయి ఆలయాన్ని సందర్శించినట్లు కూడా పేర్కొనబడింది.
9/ 14
ఈ ఆలయం చుట్టూ 30 మంది బ్రాహ్మణుల అగ్రహారం ఉండేదని పూర్వీకుల ద్వారా తెలుస్తోంది.
10/ 14
దీనిని పరిశీలించిన ఆయన అప్పటి నిజాం నవాబుల ధాటికి తట్టుకుని బురదలో కమలం వలే వికసిస్తున్న ఆలయం అని ఆ కాశీ చరిత్ర పుస్తకంలో పేర్కొన్నట్టు చరిత్ర చదివిన వారు చెప్తున్నారు.
11/ 14
అయితే ఇక్కడ వెలిసిన మూల విగ్రహం ఏడు అడుగుల ఎత్తులో ఉంటూ చుట్టూరా దశావతారాలతో పాటు సీతమ్మ తల్లిని తొడపై కూర్చుండబెట్టుకుని శ్రీరాముడు ఏకశిలా విగ్రహంగా కొలువుదీరి భక్తులకు దర్శనమివ్వడం విశేషం.
12/ 14
ఈ ఆలయంలో సీతా సమేతంగా శ్రీ రాముడు హనుమంతుడు ఉండి లక్ష్మణుడు లేని దేవాలయంగా ప్రజల్లో ప్రాచుర్యం పొందింది. భారత దేశంలోనే ఇది మొదటి దేవాలయం కావడం మరో విశేషం.
13/ 14
అంతే అనుకుంటున్నారా..తిరుపతి వెంకటేశ్వరస్వామి అందుకుంటున్న పూజల తర్వాత దక్షిణ భారతదేశంలో ఒకప్పుడు రాజలాంఛనాలతో పాటు విశేష ఆరాధన అందుకుని విరాజిల్లిన ఘనత కూడా ఈ రామాలయానికి ఉందని పండితులు పేర్కొంటున్నారు.
14/ 14
అయోధ్యలో పట్టాభిషేకం తరువాత శ్రీరాముడు సీతా సమేతంగా కొలువుదీరిన మాదిరిగానే ఇక్కడ విగ్రహం ఉండడంతో ఈ ప్రాంతం తెలంగాణ అయోధ్య అని కూడా పిలుస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.