తెలంగాణాలో ప్రస్తుతం ఎన్నికల వాతావరణం తలపిస్తుంది. ప్రధాన పార్టీలన్నీ కూడా పాదయాత్రలతో ప్రజల్లోనే ఉంటున్నారు. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ గా నియామకం తరువాత రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. ఇక హాత్ సే హాత్ జోడో యాత్రతో కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకొచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికల ఫలితాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.