కాలేజీలు, విశ్వ విద్యాలయాల్లో ర్యాగింగ్ భూతం కోరలు చాచుతోంది. చాప కింది నీరులా ఎక్కడో ఓ చోట ర్యాగింగ్ భూతం తన ప్రతాపాన్ని చూపెడుతూనే ఉంది. ఈ ర్యాగింగ్ కారణంగానే విద్యార్థులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. తాజాగా నిజామాబాద్ జిల్లాలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ర్యాగింగ్ భూతం వెలుగు చూసింది.