Telangana : మాయమవుతున్న మట్టి ప్రమీదలు .. కృత్రిమ దీపాలతో కుమ్మరులకు ఉపాధి కరువు
Telangana : మాయమవుతున్న మట్టి ప్రమీదలు .. కృత్రిమ దీపాలతో కుమ్మరులకు ఉపాధి కరువు
Telangana: ప్రస్తుతం వాటి స్థానంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారుచేసిన బొమ్మలను వాడుతున్నారు. మట్టితో తయారు చేసిన బొమ్మలపైనే ఆధారపడి జీవించే కుమ్మరు లపై బాగా ప్రభావం చూపుతొంది.
దీపావళి అంటేనే దీపాల కాంతులతో వెలిగిపోతూ జరుపుకునే పండగ. ఈ పండగలో ప్రత్యేకం గా ప్రమిదలతో దీపారాధన చేసి లక్ష్మి దేవిని పూజిస్తారు. అయితే ఈ దీపావళి పండగ వచ్చిందంటే కుమ్మరి కలకారులకు చేతి నిండా పని ఉండేది.
2/ 12
అయితే అనాదిగా వస్తున్న మట్టి ప్రమీదల వాడకం ఇప్పుడు బాగా తగ్గిపోయింది. గతంలో దీపాలను మట్టి ప్రమీదల్లోనే వెలిగించే వారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇది తప్పని సరిగా వాడేవారు. రాను రాను ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న ఆర్టిఫిషల్ ప్రమీదల వాడకం ఎక్కువైంది.
3/ 12
ముఖ్యంగా రాజస్థాన్, కోల్కతా నుంచి వస్తున్న ప్రమీదలు వాడుతున్నారు. దీంతో ఉపాధి కరువైందని నిజామాబాద్ జిల్లా కుమ్మరి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
4/ 12
దీపావళి అంటేనే చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతికా గా భావిస్తారు. దీపావళి రోజు వివిధ రకాల బొమ్మలతో బొమ్మల కొలువు చేసుకుంటారు. అందుల్లో అన్ని కూడా మట్టి తో తయారు చేసిన ప్రమిదలు, ఆవు బోమ్మలు.. చిన్ని చిన్న కుండా పాత్రల తో బోమ్మల కొలువు నిర్వహిస్తారు.
5/ 12
ప్రస్తుతం వాటి స్థానంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారుచేసిన బొమ్మలను వాడుతున్నారు. మట్టితో తయారు చేసిన బొమ్మలపైనే ఆధారపడి జీవించే కుమ్మరు లపై బాగా ప్రభావం చూపుతొంది.
6/ 12
దీంతో వారి జీవనం గడవడం కష్టంగా మారింది. ఎంతో కష్టపడి మట్టితో ప్రమీదలు సహా ఇతర వస్తువులను తయారు చేసే వారి పరిస్థితి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ దెబ్బకొడుతొంది. దీంతో కుమ్మరి కలకారులు వారి జీవనాదారమైన ప్రమిదలు, మట్టి కుండలు, మట్టి బొమ్మలకు ఆదరణ కరువైంది.
7/ 12
తాత, ముత్తాతల కాలం నుంచి ఇదే వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాము. అయితే గత కొద్ది రోజులుగా రెడీమేడ్ ప్రమిదలు రావడంతో మాకు పెద్ద గిరాకీ లేదని కుమ్మరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో దీపావళికి తమ జీవితాల్లో వెలుగులు కనిపించేవని జానాకి రామ్ అంటున్నారు.
8/ 12
అడవి నుంచి మట్టిని తీసుకువచ్చి.. మట్టిని ముద్దగా చేసి దాన్ని చక్రం పై వేసి తిప్పి ఆ మట్టికి రూపం ఇస్తామని చెప్పారు జానకీరామ్. అగ్నిలో వేసి కల్చినా తరువాత వారికి రంగులు వేసి విక్రయిస్తామని చెబుతున్నారు.
9/ 12
ఇంత కష్టపడి చేసిన ప్రమిదలు అమ్మితే కనీసం కూలీ కూడా గిట్టుబాటు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేసారు.. ఇతర రాష్ట్రాల నుంచి రెడిమేడ్ ప్రమిదలు బోమ్మలు రావడంతో మా పరిస్థితి మారింత దారుణంగా తాయరైందని వారు అవేదన వ్యక్తం చేస్తున్నారు.
10/ 12
దీంతో మాకు ఈ ప్రమిదలు చేసిన గిట్టుబాటు కావడం లేదు అన్నారు. మా వద్ద రూపాయి నుంచి మొదలు కుని వేయ్యి రూపాయల వరకు ప్రమిదలు ఉన్నాయనివ్యాపారి రంజీత్ కుమార్ అంటున్నారు.
11/ 12
మేము హర్యానా, కలకత్త ఇలా 5 రాష్ట్రాల నుంచి ఈ ప్రమిదలను.. వివిద రకాల బోమ్మలను తీసుకు వచ్చి నిజామాబాద్ , కామారెడ్డి, జగిత్యాల్ , హైదరాబాద్ వంటి చోట్ల మేము అమ్మకాలు కొనసాగిస్తున్నారు.
12/ 12
ప్రస్తుతం వాటి స్థానంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారుచేసిన బొమ్మలను వాడుతున్నారు. మట్టితో తయారు చేసిన బొమ్మలపైనే ఆధారపడి జీవించే కుమ్మరు లపై బాగా ప్రభావం చూపుతొంది.