KCR TOUR : గులాబీమయంగా మారిన నిజామాబాద్ .. సీఎం కేసీఆర్ పర్యటనకు భారీ ఏర్పాట్లు
KCR TOUR : గులాబీమయంగా మారిన నిజామాబాద్ .. సీఎం కేసీఆర్ పర్యటనకు భారీ ఏర్పాట్లు
KCR TOUR: సీఎం కేసీఆర్ నిజామాబాద్ పర్యటనతో నగరం గులాబీ రంగు పూసుకుంది. జిల్లా నూతన కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించేందుకు వస్తున్న టీఆర్ఎస్ అధ్యక్షుడి గ్రాండ్ వెల్కమ్ పలుకుతూ గులాబీ శ్రేణులు ప్లెక్సీలు, జెండాలు, గులాబీ తోరణాలతో నగరాన్ని గులాబీమయం చేశారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 25 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో నూతన కలెక్టరేట్ భవనాన్ని సీఎం ప్రారంభిస్తారు. ఇందులో భాగంగానే కలెక్టరేట్‌ను పరిమళభరితమైన పూల మొక్కలను ఏర్పాటు చేశారు. కలెక్టర్ ఆఫీస్ ప్రాంగణం సువాసనలతో నిండిపోయింది.
2/ 9
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిజామాబాద్ జిల్లా పర్యటన సందర్భంగా అధికారులు, పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. సీఎంకు గ్రాండ్ వెల్కమ్ పలుకుతూ నిజామాబాద్ నగరాన్ని గులాబీమయంగా మార్చేశారు.
3/ 9
సీఎం కేసీఆర్ పర్యటన నేపధ్యంలో ఆయనకు ఘనస్వాగతం పలుకుతూ రోడ్లు, చౌరస్తాల్లో గులాబీ ఫ్లెక్సీలు, జెండాలను స్వాగత తోరణాలుగా ఏర్పాటు చేశారు. జిల్లాకు చెందిన మంత్రి మంత్రి ప్రశాంత్ రెడ్డి సీఎం సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
4/ 9
సోమవారం మధ్యాహ్నం ప్రత్యేక హెలిక్యాప్టర్‌లో సీఎం కేసీఆర్ నిజమాబాద్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటలకు పోలీసు పరేడ్ మైదానానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఎల్లమ్మగుట్ట ప్రాంతంలో నిర్మించిన టీఆర్ఎస్ ఆఫీస్‌కి 2 గంటల 10 నిమిషాలకు చేరుకుంటారు.
5/ 9
మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు పార్టీ కార్యలయాన్ని ప్రారంభిస్తారు సీఎం. అనంతరం పార్టీ జిల్లాలోని పార్టీ బాధ్యతలను అధ్యక్షుడు జీవన్ రెడ్డికి అప్పగిస్తారు. ఈకార్యక్రమంలో జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేతలంతా హాజరుకానున్నారు.
6/ 9
మధ్యాహ్నం 2 గంటల 40 నిమిషలకు దుబ్బ ప్రాంతంలోని 25ఎకరాల సువిశాల స్తలంలో నిర్మించిన నూతన సమీకృత కలెక్టర్ కార్యాలయ భవన సముదాయానికి చేరుకుంటారు. మద్యాహ్నం 3 గంటలకు నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవం చేస్తారు సీఎం కేసీఆర్.
7/ 9
అక్కడి నుంచి నేరుగా గిరిరాజ్ కళాశాల మైదానంలో బారీ బహిరంగా సభ ఏర్పాటు చేసారు. ఆ సభలో సీఎం కేసీఆర్ ప్రజలను ఉద్యేశించి ప్రసంగిస్తారు. సీఎం పర్యటన, జిల్లా కలెక్టరేట్ ఓపెనింగ్, బహిరంగసభ కార్యక్రమాలకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
8/ 9
మరోవైపు జిల్లాకు చెందిన గులాబీ నేతలు బహిరంగ సభను విజయవంతం చేయడానికి భారీ జనసమీకరణను చేపట్టారు. నిజామాబాద్‌లో కేసీఆర్ బహిరంగ సభ ముగియగానే సాయంత్ర 4 గంటలకు హెలిక్యాప్టర్‌లోనే హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు.
9/ 9
సీఎం కేసీఆర్ నిజామాబాద్ పర్యటనతో నగరం గులాబీ రంగు పూసుకుంది. జిల్లా నూతన కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించేందుకు వస్తున్న టీఆర్ఎస్ అధ్యక్షుడి గ్రాండ్ వెల్కమ్ పలుకుతూ గులాబీ శ్రేణులు ప్లెక్సీలు, జెండాలు, గులాబీ తోరణాలతో నగరాన్ని గులాబీమయం చేశారు.