Plantation: ఇజ్రాయిల్‌లో నిజామాబాద్ జిల్లా శ్రీమంతుడు .. సొంత ఊరి కోసం ఏం చేశాడో తెలుసా..?
Plantation: ఇజ్రాయిల్‌లో నిజామాబాద్ జిల్లా శ్రీమంతుడు .. సొంత ఊరి కోసం ఏం చేశాడో తెలుసా..?
Nizamabad: ప్రకృతి పై తనకు ఉన్న ప్రేమను చాటుకున్నాడో ఎన్నారై. రోడ్డు వెడల్పులో భాగంగా 70 నుంచి 80ఏళ్ల క్రితం నాటి పెద్ద పెద్ద వృక్షాలను తొలగించాలని అధికారులు నిర్ణయించారు. వాటిని తన సొంత ఖర్చులతో వేరే చోట ఏర్పాటు చేయించాడు.
ప్రకృతి పై తనకు ఉన్న ప్రేమను చాటుకున్నా ఎన్నారై మనసుంటే మార్గ ముంటాదని నిరూపిస్తున్నాడు. రోడ్డు వెడల్పులో భాగంగా 70 నుంచి 80ఏళ్ల క్రితం నాటి పెద్ద పెద్ద వృక్షాలను తొలగించాలని అధికారులు నిర్ణయించారు.
2/ 14
ఈవిషయాన్ని ఈ విషయం స్థానికుల ద్వారా తెలుసుకున్న ఓ ఏన్నారై మంచి ఆలోచన చేశారు. రోడ్డుకు ఇరవైపుల పెరిగిన మహా వృక్షాలను నరికివేస్తే తిరిగి అలాంటి వాటిని పొందలేమని భావించాడు. ప్లాంటేషన్ ప్రక్రియ ద్వారా వాటికే ప్రాణం పోయాలని భావించాడు.
3/ 14
ఇజ్రాయిల్ ఎంత పెద్ద వృక్షాలనైన ఒక చోటి నుంచి మరొక చోటుకు మార్చడం చూసిన ఎన్నారై ..అదే పద్దతిని పాటించాలని భావించాడు. అందుకు అయ్యే ఖర్చును తాను భరిస్తానని చెప్పడంతో స్థానికులతో పాటు అధికారులు అంగీకరించారు.
4/ 14
ప్రజలకు జీవ వాయువును అందించే చెట్లు, మహావృక్షాలను బ్రతికించాలని ఓ ఎన్నారై సొంత ఖర్చులతో ప్లాంటేషన్ ప్రక్రియను మొదలు పెట్టిన సంఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. కమ్మర్పల్లి మండల కేంద్రంలో తెలంగాణ సర్కారు రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని చేపట్టింది.
5/ 14
అందులో భాగంగా మహా వృక్షాలను తొలగించేందుకు సిద్ధమైంది. అయితే అదే గ్రామానికి చెందిన గుగ్గిలం దేవరాజు అనే ఎన్నారై.. ఇజ్రాయిల్ గత కొంత కాలంగా ఉద్యోగం చేస్తున్నారు. అయితే స్నేహితుల ద్వారా దేవరాజ్‌కు చెట్లు తొలగిస్తున్న విషయం తెలిసింది.
6/ 14
దేవరాజ్ ఇజ్రాయిల్ దేశంలో వృక్షాలను ఒక చోట నుంచి మరో చోటుకు తీసుకువెళ్లి ప్లానిటేషన్ చేయడానికి తన స్వయంగా చూశాడు. అదే విధంగా తన గ్రామంలో కూడా తొలగించాలనుకున్న చెట్లను మరొక చోటికి మార్చుదామని స్నేహితులకు తెలిపాడు.
7/ 14
ఈ ప్లాంటేషన్ ప్రక్రియకు అయ్యే ఖర్చును తాను భరిస్తానని గ్రామస్తుల్ని, అధికారులకు హామీ ఇచ్చాడు. అనుకున్నదే తడువుగా తన గ్రామంలో తొలగించ బడుతున్నటువంటి 15 చెట్లను తన సొంత ఖర్చులతో మరోచోట ప్లానిటేషన్ చేయించారు.
8/ 14
మొదటి తొలగించాల్సిన వృక్షం కోసం వేరే చోట గుంత తొవ్వి తర్వాత పురాతన చెట్టును జాగ్రత్తగా వేర్లతో సహా ప్రొక్లెయిన్, జేసీబీల సాయంతో లీఫ్ట్ చేయించారు. ఆ చెట్టును తొవ్విన గుంతలో మరో చోట మొలకెత్తించారు. ఈవిధంగా 15చెట్లకు తిరిగి ప్రాణం పోశారు.
9/ 14
ఒకటి రెండు కాదు సుమారు 15 వృక్షలు... 80, 90 యేళ్ల పై బడిన వాటిని మరో చాట ప్లానిటేషన్ చేశారు ఎన్నారై దేవరాజ్. ఓ ఎన్నారై ప్రకృతిపై తనకున్న ప్రేమను చాటుకున్నాడు. స్వగ్రామానికి ఈవిధంగా ఉపకారం చేయాలనుకున్న దేవరాజ్‌ని గ్రామస్తులు అభినందిస్తున్నారు.
10/ 14
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమంలో భాగంగా కోట్ల మొక్కలు నాటారు. ఆ మొక్కలు మహావృక్షాలుగా మారాలంటే మరో 50 ఏళ్లు పట్టొచ్చు. అయితే ఇప్పుడు మొక్కలు నాటి..వాటిని మహావృక్షాలుగా పెరిగే వరకు సంరక్షించడం కష్టమైన పని.
11/ 14
అందుకే మహావృక్షాలుగా ఉన్న వాటిని ఎందుకు నాశనం చేయాలని దేవరాజ్ ఆలోచనను స్నేహితులతో పాటు అధికారులు స్వాగతించారు. ఆ దిశగానే ప్లాంటేషన్ ప్రక్రియను దిగ్విజయంగా పూర్తి చేస్తున్నారు. రోడ్డు వెడల్పు కార్యక్రమానికి సహాకరిస్తూనే మహా వృక్షాల్ని మరోచోట పాతించారు.
12/ 14
తొలగించిన చెట్లను అటవీ ప్రాంతంలో కొన్ని .. గ్రామంలోని స్పోర్ట్స్ సెంటర్ దగ్గర కొన్ని స్పోట్స్ చెట్లను నాటారు. మనకు ఆక్సిజన్ ఇచ్చే ఇంత పెద్ద వృక్షాలను బ్రతికించుకోవాలన్న మంచి ఆలోచనతోనే తన వంతు సహయం చేశానని దేవరాజ్ తెలిపారు.
13/ 14
కమ్మర్పల్లి గ్రామంలో రోడ్డు వెడల్పులో భారీ వృక్షాలను తొలగిస్తున్నారని తన స్నేహితుడు, గ్రామస్తుడు హనుమాడ్లు ద్వారా తెలుసుకొని ఈనిర్ణయం తీసుకున్నానని ఎన్నారై దేవరాజ్ తెలిపారు. 50ఏళ్లకు పైబడిన చెట్లన్ని రాజకార్ల కాలంలో నాటించినవిగా చెబుతున్నాడు.
14/ 14
గ్రామం విడిచి వేరే దేశానికి వెళ్లినప్పటికి గ్రామస్తులకు యోగక్షేమాలు, పర్యావరణ హింత కోరుతూ దేవరాజ్ తీసుకున్న నిర్ణయం అభినందనీయమని అందరు ప్రశంసిస్తున్నారు. ఈ విధంగా 15చెట్లను మరో చోట మార్చేందుకు రెండు లక్షల రూపాయలకు పైగా ఖర్చైంది.