మంచాల శంకరయ్య గుప్త చారిటబుల్ ట్రాస్ట్ ద్వారా జ్ఞానేందర్ గత పదేళ్లుగా ప్రజాసేవలో ఉన్నారు. నిజామాబాద్, బోధన్, బాన్సువాడ, సిరిసిల్ల, వేములవాడ, వనపర్తి, హైదరాబాద్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో వివిధ రకాలైన సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఉచితంగా స్వర్గాయత్ర రథాలు, వాటర్ ట్యాంకర్లు, ఎవరైన ఆనాదలు చనిపోతే 50 మందికి సరపడా బోజనం అందిస్తున్నారు.
తమ పెద్ద కుమార్తె డాక్టర్ శరణ్య పర్యావరణానికి హాని కలుగకుండా శుభలేఖలు ఉండాలని ఈ కొత్త ఆలోచన చేశారు. వివాహనంతరం శుభలేఖ వ్యర్ధం కాకుండా ఉపయోగపడే విధంగా ఉండేందుకే మూడు నెలలుగా ఆలోచించి కార్డును ప్రత్యేకంగా తయారు చేయించామన్నారు అహ్మదాబాద్ లో మూడు నెలల క్రితం రెండు వేల కార్డులు ప్రింట్ చేయడం జరిగిందన్నారు.