చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలంటారు పెద్దలు. మొక్కై వంగనిది మానై వంగుతుందా అంటారు. ఇలాగే ఉంది నిజామాబాద్‌లో టీఆర్ఎస్ వ్యవహారం. మొదట నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై అధికార పార్టీ పెద్దగా ఫోకస్ చేయలేదు.కనీసం లోక్‌సభ ఎన్నికల తర్వాత అయినా ఆర్వింద్‌పై సీరియస్‌గా ఫోకస్ పెట్టకుండా అధికార పార్టీ లైట్‌గా తీసుకుంది. ఇదే అదునుగా భావించిన ఎంపీ ఆర్వింద్ పార్టీలో బలమైన నాయకుడిగా ఎదిగాడు. (FILE PHOTO)
నిజామాబాద్ జిల్లాలో రాజకీయం ఎన్నికలకు ముందే వేడెక్కి.. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ రాజకీయ మొదలైంది. సీఎం కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత 2014 ఎన్నికల్లో మేజారిటి సీట్లు సాదించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయినా తనకు ఆపోజిషన్లో ఉన్న నాయకులను తనవైపుకు తిప్పుకున్నారు గులాబీ బాస్. తనకు బలమైన ఆపోజిషన్ లేకుండా చేసుకున్నారు. (FILE PHOTO)
ఫలితంగా తెలంగాణలో సీఎం కేసీఆర్‌కు ఎదురులేని నేతగా నిలిచారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ పార్ల మెంట్ నియోజకవర్గంలో అన్ని స్థానాలు టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. అయితే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో సీఎం తనయ కల్వకుంట్ల కవిత రెండో సారి పోటిలో నిలబడి బీజేపీ అభ్యర్ధిగా నిలబడిన ధర్మపురి అర్వింద్ చేతిలో ఓడిపోయారు. (FILE PHOTO)
అర్వింద్ తొలిసారి పోటీ చేస్తుండటంతో సునాయాసంగా గెలుస్తాననే ధీమాతో ఉన్న ఎమ్మెల్సీ కవిత ఊహించని విధంగా ఓటమి పాలయ్యారు. దాని ఫలితంగా కొన్ని నెలల పాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆ గ్యాప్‌లోనే బీజేపీ ఎంపీగా గెలిచిన అర్వింద్ తన వాగ్ధాటితో సీఎం కేసీఆర్, కేటీఆర్, కవితకు కౌంటర్లు ఇస్తూ వచ్చారు. (FILE PHOTO)
ధర్మపురి అర్వింద్‌కు కావాల్సినంత మైలేజ్ వచ్చే వరకు గులాబీ నేతలు, పార్టీ కీలక నేతలు సైతం స్పందించలేదు. ఫలితంగా ఆ తర్వాత నిజామాబాద్ కార్పొరేషన్లో కూడా ఎన్నడూ లేని విధంగా బీజేపీ 28 కార్పొరేటర్లను గెలుచుకుంది. దీంతో అర్వింద్‌కు బీజేపీ హైకమాండ్ దగ్గర, పార్టీలో మంచి పొజిషన్ సంపాధించుకున్నారు. (FILE PHOTO)
అయితే ఎంపి ఆర్వింద్ సీఎం కేసీఆర్, కేటీఆర్, కవితను టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. కానీ అధికార టీఆర్ఎస్ నుంచి ఎవరు కూడా కచ్చితంగా.. ఆర్వింద్ ను టార్గెట్ చేస్తు కౌంటర్ ఇవ్వడంలో విఫలం చెందారు. ఎమ్మెల్సీ కవిత కూడా ఎప్పుడు కూడా అర్వింద్‌ను టార్గెట్ చేస్తు విమర్శలు చేయలేదు. (FILE PHOTO)
ఇదే దూకుడును టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మొదట్నుంచి చూపించి ఉంటే ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు ఇవాళ ఇంతటి పొజిషన్ వచ్చేది కాదని ..ఆయన నోరు అదుపులో పెట్టుకునే వారని అంటున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ధర్మపురి అర్వింద్‌ని పరోక్షంగా పెద్దవాడ్ని చేసింది ఎమ్మెల్సీ కవితనే అని రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. (FILE PHOTO)