హర్ష ఫోన్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. వైద్య విద్యార్ధి ఫోన్ స్వాధీనం చేసుకుని చాటింగ్ వివరాలు సేకరించారు. అనుమానస్పద చాటింగ్ ఏమి లేదని.. ఉరి వేసుకోవడం వల్లే చనిపోయినట్లు నిర్ధారించారు పోలీసులు. మరో 15 రోజుల్లో ఎంబీబీఎస్ పరీక్షలు పూర్తై.. పట్టా అందుకోవాల్సిన హర్ష అర్ధాంతరంగా బలవన్మరణానికి పాల్పడటం పట్ల తోటి విద్యార్ధులు షాక్ గు గురయ్యారు.
హర్ష జ్ఞాపకాలను తలచుకుని కన్నీటి పర్యంతం అయ్యారు స్నేహితులు. హర్ష మృతి విషయం తెలుసుకుని తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మృత దేహానికి పోస్టు మార్టం నిర్వహించి. బంధువులకు అప్పగించారు. హర్ష మృతికి అనారోగ్య సమస్యలు కారణమా.. ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అన్నది పోలీసుల విచారణలో తేలనుంది.