Agriculture: 50వేల పెట్టుబడితో లక్షల్లో లాభం.. సంప్రదాయ పంటల కంటే అధిక రెట్లు లాభాలిస్తున్న యాపిల్ బేర్
Agriculture: 50వేల పెట్టుబడితో లక్షల్లో లాభం.. సంప్రదాయ పంటల కంటే అధిక రెట్లు లాభాలిస్తున్న యాపిల్ బేర్
Profitable Crops: వ్యవసాయాన్నే నమ్ముకున్న రైతులు కొత్తగా ఆలోచిస్తున్నారు. సాధారణ పద్దతులు, సంప్రదాయ పంటలతో శ్రమ తప్ప లాభం లేదని భావిస్తున్నారు. అందుకే ప్రత్యామ్నాయ పంటలు, ఆదాయం వచ్చే సాగుపై దృష్టి పెడుతున్నారు. అందులో ఫలితాల్ని రుచి చూస్తున్నారు. లాభాల్ని గడిస్తున్నారు.
వ్యవసాయాన్నే నమ్ముకున్న రైతులు కొత్తగా ఆలోచిస్తున్నారు. సాధారణ పద్దతులు, సంప్రదాయ పంటలతో శ్రమ తప్ప లాభం లేదని భావిస్తున్నారు. అందుకే ప్రత్యామ్నాయ పంటలు, ఆదాయం వచ్చే సాగుపై దృష్టి పెడుతున్నారు. అందులో ఫలితాల్ని రుచి చూస్తున్నారు. లాభాల్ని గడిస్తున్నారు.
2/ 14
నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ రైతు సంప్రదాయ పంటలకు స్వస్తి పలికి వినూత్న సాగును చేపట్టాడు. ఫలితం ఎలా ఉంది..? ప్రత్నామ్నాయ సాగు కోసం తన వ్యవసాయ క్షేత్రంలో కాశ్మీర్ యాపిల్ బేర్ సాగుకు చేయాలని నిర్ణయించుకున్నారు.
3/ 14
బుర్రలో ఆలోచన తట్టడమే ఆలస్యం తనకున్న వ్యవసాయ భూమిలో యాపిల్ బేర్ పంటను సాగు చేశాడు. రైతు ఎంత పెట్టుబడి పెట్టాడు..ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడనే విషయాన్ని న్యూస్18తో పంచుకున్నాడు.
4/ 14
నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ మండలం మంథని గ్రామానికి చెందిన రైతు బ్రహ్మణ పల్లి చిన్నయ్య సంప్రదాయ పంటలకు భిన్నంగా కశ్మీర్ యాపిల్ బేర్ సాగు చేయాల్ని నిర్ణయించుకున్నారు. రూ.30 వేలు వెచ్చించి కోలకత్తా నుంచి 750 మొక్కలు తెప్పించారు.
5/ 14
గతేడాది మే రెండో వారంలో మొక్కల మధ్య 6, 12 మీటర్ల దూరం ఉండేలా ఎకరం విస్తీర్ణంలో మొక్కలు నాటారు. పండ్లు కోత దశకు వచ్చే సమయంలో బరువుగా తయారై కొమ్మలు కిందికి వాలిపోకుండా కర్రల పైకి చేరేలా ఏర్పాటు చేసుకున్నారు.
6/ 14
పండ్లు నాణ్యంగా మంచి రుచితో ఉండటంతో మార్కెట్లో డిమాండ్ ఏర్పడింది. దీంతో పంట క్షేత్రం వద్దే షెడ్డు వేసి విక్రయిస్తున్నారు. నిత్యం దిగుబడి వస్తుండటంతో ఓ సూపర్ మార్కెట్ కూ సరఫరా చేస్తున్నారు... కిలో రూ. 100 వరకు పలుకుతోంది.
7/ 14
బిందు సేద్యం ద్వారా నీరందిస్తూ కీటకాలు ఆశించ కుండా సస్యరక్షణ చర్యలు చేపడుతు న్నారు. మొక్కలు ఏపుగా పెరిగి డిసెంబరులోనే కాత రావడం మొదలైంది. అయితే ఈ ప్రత్యామ్నాయ పంటల సాగు కోసం కూలీల ఖర్చులు, కర్రల ఏర్పాటుకు మరో రూ.20 వేలుఖర్చు చేశారు.
8/ 14
రెండు నెలల్లో సుమారు రెండు టన్నుల దిగుబడి రాగా ఇప్పటికే రూ.2 లక్షల ఆదాయం వచ్చింది.. ఇంకా రెండు, మూడు టన్నుల దిగుబడి రానుంది. ఇప్పటికే ఆరు రేట్ల లాభం వచ్చింది. కొత్త రకం పంట పెట్టాలని ఉద్దేశంతో కాశ్మీర్ఆపిల్ బేర్ ను ఎంచుకోవడం జరిగిందన్నారు రైతు బ్రాహ్మణపల్లి చిన్నయ్య.
9/ 14
ఈ సీడ్ ను కలకత్తా నుంచి తెప్పించినట్లుగా తెలిపారు. కోమటిపల్లి ముత్తన్న అనే తన బావ సలహాతోనే ఈ పంట సాగు చేయడం జరిగిందన్నారు. మొక్క 30 రూపాయలు పడిందని మరో 20 రూపాయలు మొక్క పెట్టడానికి ఖర్చు అయిందన్నాడు.
10/ 14
మొత్రం 750 మొక్కలను తీసుకువచ్చిన రైతు మే లో మొక్కలు నాటారు. డిసెంబర్లో పంట మొదటి దిగుబడి వచ్చింది. అయితే మా వ్యవసాయ క్షేత్రం రోడ్డుకు ఆనుకుని ఉండటంతో పండిన పంటను కిలో వంద రూపాయలకు విక్రయిస్తున్నట్లు తెలిపారు.
11/ 14
దీని వల్ల ట్రాన్స్పోర్ట్ శ్రమ, ఖర్చు తగ్గుతోందని రైతు చెబుతున్నారు. అంతే కాదు పండును తిన్న తరువాత ఎక్కువ మంది కోనుగోలు చేస్తున్నారని.. ఇప్పటి వరకు రెండు టన్నుల వరకు దిగుబడి వచ్చినట్లుగా తెలిపారు.
12/ 14
మరో ఒకటిన్నర నెలల్లో మూడు టన్నుల వరకు దిగుబడి వచ్చే ఆవకాశం ఉంది. ఈ యాపిల్ బేర్ పంటకు అంతర్ పంటగా ఎకరంలో బంతి పూల మొక్కలు,పచ్చిమిరపను సాగు చేసారు. దీని వల్ల దసరా, దీపావళి, కార్తీక పౌర్ణమి కలిసి వచ్చిందంటున్నారు.
13/ 14
బంతి పంట సాగుతో 40వేల రూపాయలు వచ్చినట్లుగా చెప్పారు. రెగ్యులర్గా వేసే పంటలతో పోలిస్తే ఈవిధంగా ప్రత్యామ్నాయ పంటలతో మంచి దిగుబడి వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు రైతు.అయితే ఈసాగులో ఒకటే ఇబ్బందిగా ఉందన్నారు.
14/ 14
యాపిల్ బేర్ సాగు లాభదాయకంగా, శ్రేయస్కరకంగానే ఉన్నప్పటికి ముళ్ళు ఉండడం వల్ల పండ్లు తెంపడం కొంచెం కష్టంగా ఉందంటున్నారు. ఆ కొద్ది కష్టాన్ని లాభాలు మర్చిపోయేలా చేస్తున్నాయని ఉంటుంది.. కానీ మంచి లాభాలు ఉన్నాయి అన్నారు.