ఫలితంగానే వెంకటాపూర్-అగ్రహార్ గ్రామంలో పట్టాదారు పుస్తకాలు, పొలం దస్తావేజులు ఉంచుకొని దశాబ్ధాలుగా సాగుచేస్తున్న రైతులు కౌలురైతులుగా మిగిలిపోవాల్సిన దుస్థితి తలెత్తింది. అంతే కాదు రాష్ట్ర ప్రభుత్వం పంటసాయం కింద ఇచ్చే రైతుబంధు, రైతు చనిపోతే ఇచ్చే రైతు భీమా వంటి పథకాలు గ్రామానికి చెందిన ఏ రైతు నోచుకోవడం లేదు.