కుడుకతో బోసుకున్న బియ్యన్ని పరమాన్నంగా వండుకొని అది ఆ ఇంటి వారే తినడంతో ఈ జట్టక్క పండుగ ముగుస్తుంది. దీంతో జట్టక్కపోయి లక్ష్మీదేవి ఇంటికి ఆహ్వానించినట్టుగా గ్రామస్తులు భావిస్తారు. అయితే ఇప్పుడు ఈ గ్రామస్తులంతా ఊరి పొలిమేర దగ్గర పాత సామాన్లు వేయడంతో మళ్ళీ వచ్చేవారం లేదంటే ఒక సంవత్సరం వరకు ఆగి ఈ పండగ చేసుకుంటారు.
ఈ పండగను గొలుసుకట్టు పండుగగా జరుగుతూనే ఉంటుంది. పండుగను ప్రతి ఏడూ చేసుకునే పండగ కాదు. మా పైన ఉన్న గ్రామం వారు చేయకుంటే మానకు చేసుకొకుడాదు.. ఈ నియమాలు తప్పని సరిగా పాటించాలి.. అయితే దుబ్బాక గ్రామాంలో గత 23 ఏళ్ల తర్వాత ఈ గ్రామంలో ఈ పండగ నిర్వహించామని స్థానికులు చెబుతున్నారు. ఈ పండుగ చేసుకుంటే ఆ గ్రామంలో ఆరిష్టం పోయి లక్ష్మి దేవి ప్రతి ఇంటికి వస్తుందని గంగవ్వ ఆనే వృద్దురాలు చెబుతుంది.