ఆదివారం మధ్యాహ్నం నుంచే తండ్రికి ఇంట్లో తాళం పెట్టి ఉంచి విందుకు వెళ్లారు... అయితే ఈ విందు ఎక్కడ ఆగిపోతుందోనని ముందస్తు ప్లాన్ ప్రకారమే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు గ్రామస్తుల ద్వారా తెలుస్తోంది... ఆదివారం రాత్రి కన్న తండ్రిని చంపేసి పెట్రోల్ పోసి దహనం చేశారు. కాపాడండి, మంటలు అంటుకున్నాయని ఆంజనేయులు కేకలు విని చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. కాపాడే ప్రయత్నం చేయడంతో కూతుర్లు అడ్డుపడ్డారని గ్రామస్తులు అంటున్నారు..
గుడిసెలో ఉన్న ఆంజనేయులు సజీవదహనం కావడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు... చివరి క్షణాల్లో బుక్కేడు అన్నం పెడుతారు ఆనుకున్న కూతుళ్లు బ్రతికి ఉండగానే సజీవదాహనం చేసి వారి పైచాకికాత్వాన్ని ప్రదర్శించారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.