Profitable cultivation : ఏడాదిలోనే పంట చేతికి .. నీరు పడని భూమిలో పండ్ల తోట వేస్తే నెలకు 50వేలు ఆదాయం
Profitable cultivation : ఏడాదిలోనే పంట చేతికి .. నీరు పడని భూమిలో పండ్ల తోట వేస్తే నెలకు 50వేలు ఆదాయం
Telangana: తనకున్న నాలుగెకరాల వ్యవసాయ సాగుభూమిలో నీరు పడటం లేదని .. ఏ పంట సాగు చేసినా లాభాలు రావడం లేదని కొత్త ఆలోచన చేశాడు. తక్కువ పెట్టుబడితో ..ఇప్పుడు నెలకు 50వేల ఆదాయం పొందుతున్నాడు. ఇంతకీ రైతు చేస్తున్న సాగు ఏమిటో తెలుసా..?
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం రేకులపల్లి గ్రామానికి చెందిన లింబాద్రి అనే రైతు తనకున్న నాలుగు ఎకరాల భూమిలో 24 బోరుబావులు తవ్వించాడు. ఎందులోను ఒకచుక్కనీరు రాలేదు. దీంతో వర్షంపై ఆధారపడి మొక్కజొన్న సాగు చేశాడు రైతు లింబాద్రి.
2/ 13
సరైన సమయంలో వర్షాలు పడకపోవడంతో దిగుబడి రాక నష్టపోయారు. అయినా నేల తల్లిని నమ్ముకున్నఆ రైతు ఆలోచనకు పదును పెట్టాడు. నీరు సంవృద్దిగా లేని భూమిలో ఏ పంట వేస్తే బాగుంటుందని ఆలోచించారు.
3/ 13
తనకున్న ఆ కాస్త నీటితో జామ తోట పెట్టాలని నిర్ణయించుకున్నారు. జామ తోటలు వేయడానికి ముందుగా కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకోలేదు. అయినా తన నిర్ణయాన్ని మార్చుకోలేదు రైతు లింబాద్రి. జామలో కొత్తరకం తోటలను సాగు చేయడానికి సిద్ధమయ్యాడు.
4/ 13
జామలో తైవాన్ పింక్, హలవసపేధా అనే రెండు రకాల మొక్కలను నాటాడు. ఒకటిన్నర ఎకరంలో 13వందల మొక్కలు నాటాడు రైతు. 11 నెలల క్రితం మొక్కలు పెట్టారు. మొక్కలు పెట్టిన ఆరు నెలల నుంచి పంట మొదలైంది.
5/ 13
తొమ్మది నెలల నుంచి పంట దిగుబడి పెరిగింది. నెలకు సుమారు 50వేల నుంచి 60 వేల వరకు సంపాదిస్తున్నారు. గతంలో నష్టాలను చవి చూసిన రైతు ఇప్పుడు సిరులు పండిస్తున్నారు. వాటితో పాటు 2వందల నాటు కోళ్లు పెంచుతున్నారు.
6/ 13
ఆ కోళ్లు చెట్లవద్ద ఉన్న పురుగులను తింటూ ఎలాంటి చీడపీడలు రాకుండా ఉపయోగపడుతున్నాయి. మరో వైపు 11 నెలలుగా ఎలాంటి క్రిమిసంహరక మందులు వాడలేదు. రెండు సార్లు గో మూత్రం మాత్రమే పిచికారి చేసి తక్కువ కర్చుతో అధికలాభాలు గడిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
7/ 13
ఏడేళ్లుగా మొక్కజొన్న సాగు చేస్తూ నష్టపోయానని తనకున్న నాలుగు ఎకరాల్లో బోరు బావులు తవ్వించినా ఒక చుక్కనీరు రాకపోవడం వల్లే గతేడాది జామ తోట వేసినట్లుగా రైతు తెలిపారు. నాలుగు ఎకరాల్లో ఒకటిన్నర ఎకరంలో 13వందల జామ మొక్కలు నాటినట్లుగా చెప్పాడు.
8/ 13
మరో రెండు వందల మలబార్ మేప నాటాను. 200 నాటు కోళ్లు పెంచుతున్నాను. తక్కువ నీరు తక్కువ ఖర్చుతో జామ తోట పెట్టాను. జామ తోట పెట్టిన ఆరు నెలల నుంచే పంట వస్తుంది. 9వ నెలల నుంచి దిగిబడి పెరిగిందంటున్నారు.
9/ 13
జామ సాగు ఎంచుకోవడం వల్ల నెలకు 50 వేల రూపాయలు సంపాదిస్తున్నానని గర్వంగా చెబుతున్నారు రేకులపల్లి గ్రామానికి చెందిన లింబాద్రి. దాదాపు రెండు వందల మలబారు వేప మొక్కలు నాటాము.. దీంతో గొర్రెలకు మేత వస్తుందంటున్నాడు.
10/ 13
నాటు కోళ్లకు నీడ కూడా ఎక్కువగా ఉందని మలబార్ వేప, నాటుకుంటే రౌండర్‌గా ఫెన్సింగ్ వేసుకునే అవసరం లేదంటున్నాడు. అడవి పందులు, నెమళ్లు, జింకలు వచ్చి వెళ్తున్నాయి కాని ఇప్పటి వరకు నష్టం చేయలేదంటున్నాడు.
11/ 13
మొత్తం రెండు వందల నాటు కోళ్లను పెంచుతున్నాము. దీంతో నాటు కోళ్లు చేట్ట వద్ద ఉన్న పురుగులను తీంటు ఎంతో మేలు చేస్తున్నాయి. ఇప్పటి వరకు జామ తోటకు క్రిమిసంహరక మందులు వాడలేదంటున్నాడు రైతు.
12/ 13
గో మూత్రం పిచికారి చేశామంటున్న రైతు లింబాద్రి ..నాటు కోళ్లు మొక్కల వద్ద ఉన్న పురుగులను తింటున్నాయి. 10 ఎకరాల వరి పంట పండించే కంటే రెండు ఎకరాల జామ తోట మేలంటున్నారు నిజామాబాద్ జిల్లాకు చెందిన రైతు లించాద్రి.
13/ 13
తనకున్న నాలుగెకరాల వ్యవసాయ సాగుభూమిలో నీరు పడటం లేదని .. ఏ పంట సాగు చేసినా లాభాలు రావడం లేదని కొత్త ఆలోచన చేశాడు. తక్కువ పెట్టుబడితో ..ఇప్పుడు నెలకు 50వేల ఆదాయం పొందుతున్నాడు. జామ సాగుతో లాభాల సిరులు పొందుతున్న రైతు లింబాద్రి తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.