ఈ కార్యక్రమానికి యూనిఫాం వేసుకుని రావడానికి కవిత గారి ప్రోత్సాహమే కారణమన్న గవర్నర్... మనం క్రమశిక్షణతో ఉన్నప్పుడే, విద్యార్థులకు క్రమశిక్షణ గురించి నేర్పించగలమన్నారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ కు తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని, కవిత నాయకత్వంలో తెలంగాణ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.