తుది ఏర్పాట్లలోనూ ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ఆదివారం ఉదయం నుండి రాత్రి వరకు కూడా క్షేత్ర స్థాయిలో ఉండి పర్యవేక్షణ జరిపారు. జిల్లా కేంద్రంలో నూతన కలెక్టర్ భవన సముదాయాన్ని నిర్మించడంతో స్థానికులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ వెలుగుల్లో మెరిసిపోతున్న కలెక్టరేట్‌ను చూసేందుకు వస్తున్నారు.