కృషి, పట్టుదల ఉంటే ఎంతటి కార్యాన్నైనా సులభంగా సాధించవచ్చని నిరూపించిన గిరిజన కుసుమం. తన కుటుంబ ఆర్థిక పరిస్థితిని అధిగమించి సౌతాఫ్రికాలోని మౌంట్ కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించింది. భవిష్యత్తులో ప్రభుత్వం సహకరిస్తే మౌంట్ ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహిస్తానని బాణోత్ వెన్నెల ధీమాగా చెబుతుంది. అయితే తనకు ఆర్థిక సహకారం కావాలని కోరుతున్న వెన్నెల మనోగతం చూద్దాం..
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం సోమారంపేట్ గ్రామాంలోని సర్దాపూర్ తాండకు చెందిన బాణోత్ మోహన్, లలిత భూని దంపతులకు నాలుగురు సంతానం. ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. అయితే నాలుగురిలో చిన్నామె బాణోత్ వెన్నెల. అయితే తండ్రి మోహన్ వెన్నెల చిన్న తనంలోనే అప్పుల బాధతో చనిపోయారు. దీంతో వెన్నెల తల్లి కూలీ పనులు చేసి నాలుగురు పిల్లలను పెంచి పెద్ద చేసింది. వెన్నెల మామా సహయంతో చదువుకుంటుంది.
వెన్నెల కామారెడ్డిలోని ఓ ప్రైవేట్ జూనియర్ కాలేజిలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది. తన 8 యేళ్ల వయస్సు నుంచి గుట్టలు ఎక్కడం ఇష్టం. దీంతో అరుణాచల్ ప్రదేశ్ లోని నిమస్ ఇన్స్టిట్యూట్ లో బేసిక్ మోటారెనింగ్ కోర్స్ లో వన్ మంత్ ట్రైనింగ్ తీసుకుంది. ఎంతో పట్టుదలతో శిక్షణ తీసుకోవడంతో వెన్నెలకు ఏ గ్రేడ్ వచ్చింది. దీంతో అడ్వెంచర్ క్లబ్ కు అప్లై చేసుకుంది. అయితే 2022 సంవత్సరంలోనే వెన్నెలకు సౌత్ ఆఫ్రికాలోని కిలిమాంజారో పర్వతాన్ని అధిరోహించే అవకాశం వచ్చింది.
ఆ సమయంలో ఆర్థిక పరిస్థితుల కారణంగా తను వెళ్లలేకపోయింది. ఎవరు ఆర్థిక సహకారం అందించలేదు. చివరకు రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ రావు సహకారంతో 2023 జనవరి 26న 5,895మీటర్ల ఎత్తైన కిలిమాంజారో పర్వతాన్ని పదహరెళ్ల వెన్నెల అధిరోహించి అందరి ప్రశంలు పొందింది. ప్రభుత్వం సహకరిస్తే రాష్ట్రానికి.. దేశానికి పేరు తీసుకు వచ్చే విధంగా ప్రపంచంలోని అన్ని పర్వతాలను అధిరోహిస్తానని చెబుతుంది.
నాకు వైల్డ్ అడ్వేంచర్ అంటే చాలా ఇష్టం అని బానోత్ వెన్నెల చేబుతుంది. కిలిమాంజరో పర్వతం ఎక్కేందుకు మలావత్ పూర్ణ నే ఇన్స్ పిరేషన్ అన్నారు. ప్రభుత్వం సహకరిస్తే ఏవరెస్ట్ శిఖరాన్ని అధిరోహిస్తానని అన్నారు. నా చిన్న తనంలోనే మా నాన్న చనిపోయారు. మా అమ్మ కూలీ పని చేసి మా నాలుగురిని పెంచి పెద్ద చేసారు. మాకు మా మామా అండగా ఉన్నారు. నాకు చిన్ననాటి నుంచి వైల్డ్ అడ్వేంచర్ అంటే ఎంతో ఇష్టం. 2022లో సౌతాఫ్రికాలోని కిలిమాంజరో పర్వత అధిరోహించే అవకాశం వచ్చింది.
అయితే అనేక మంది ప్రజాప్రతినిధులను కలిసినా ఫలితం లేకుండా పోయింది. ఈ సంవత్సరం కూడా అవకాశం రావడంతో ఆర్థిక సహాయం కోసం అర్థించగా గ్రీన్ ఇండియా ఛాలెంజర్ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ తనకు ఆర్థికంగా సహాయం చేసారని చెబుతుంది. దీంతో 2023 జనవరి 26 తేదీ గణతంత్ర దినోత్సవం రోజున 5,895 మీటర్ల ఎత్తు, 19,341 ఫీట్లు ఉన్న కిలిమాంజారో పర్వతాన్ని అధిరోహించడం జరిగిందని ఆనందంగా చెబుతుంది.
పర్వతం ఎక్కే సమయంలో శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది అయినా పట్టుదలతో ముందుకు సాగానని చెప్పారు. కామారెడ్డి పేరును నిలబెట్టాలన్న కసితో వెళ్లి సాధించానన్నారు. అతి చిన్న వయసులోనే ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మలావత్ పూర్ణ తనకు స్ఫూర్తి అని పేర్కొన్నారు. భవిష్యత్తులో ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. మా వెన్నెలకు ఆర్థిక సహకారం అందించాలని వెన్నెల మామ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.