బడాపహాడ్ సయ్యద్ హజరత్ షాదుల్లా దర్గా ఉర్సు ఉత్సవాలు వక్ఫ్ బోర్డు ఆద్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలను మొదటి రోజు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ ఉత్సవాలకు తెలంగాణ, ఆంధ్రా, మహారాష్ట్ర, కార్ణటక నుంచి భక్తులు, ముల్లలు తరలి వచ్చారు. ఒంటె, గుర్రలపై షాదుల్లా బాబాను ఉరేగించారు.