Telangana : తీసుకున్న అప్పుకంటే రెట్టింపు కట్టండి .. నగ్నంగా ఉన్న ఫోటోలు పంపుతున్న లోన్ యాప్ నిర్వాహకులు
Telangana : తీసుకున్న అప్పుకంటే రెట్టింపు కట్టండి .. నగ్నంగా ఉన్న ఫోటోలు పంపుతున్న లోన్ యాప్ నిర్వాహకులు
Loan apps : లోన్ యాప్‌లో అప్పు చేస్తే అంతే సంగతులు. డబ్బులు అప్పుగా ఇచ్చిన వెంటనే వేధింపులు మొదలవుతాయి. అనుకున్న టైమ్ కంటే ముందే రెట్టింపు డబ్బులు చెల్లించమని వెంటపడుతున్నారు. ఫోన్‌కి సమాధానం ఇవ్వకపోతే ఏం చేస్తున్నారో తెలుసా.
లోన్ యాప్ ఆగడాలు మరీ శృతి మించిపోతున్నాయి. నిజామాబాద్ జిల్లా నవిపేట్ మండల కేంద్రానికి చెందిన నర్సయ్య తన ఆవసరాల కోసం 15 రోజుల క్రితం లోన్ యాప్‌లో 4వేల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు.
2/ 8
మరో లోన్ యాప్ లో 2500 రూణం తీసుకున్నాడు నర్సయ్య. అయితే అప్పు తీసుకునే సమయంలో వంద లేదంటే ఆరవై రోజుల తరువాత వడ్డీతో సహా చెల్లించాలని లోన్ యాప్ నిర్వహకులు తెలిపారు.
3/ 8
రెండు నెలలకుపైగా గడువు ఉందని నర్సయ్య భావించాడు. అయితే 15 రోజులు పూర్తిగానే లోన్ యాప్ నిర్వహకులు 4వేల రూపాయలకు వడ్డితో కలిపి రూ.16000లు కట్టాలని.. మరో యాప్ లో తీసుకున్నా రూ.2500 లకు ఏడు వేల రూపాయలు కట్టాలంటూ పోన్ చేసి బెదిరింపులకు దిగారు.
4/ 8
15రోజుల తర్వాత నుంచి లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు ఎక్కువ కావడంతో వాటిని భరించలేక ఫోన్ లిఫ్ట్ చేయడం మానేశాడు. దీంతో లోన్ యాప్ నిర్వాహకులు నర్సయ్య స్నేహితులు, బంధువులకు అతడి నగ్నంగా ఉన్న ఫోటోలను పంపారు.
5/ 8
అంతటితో ఆగకుండా లోన్ యాప్ నిర్వాహకులు బాధితుడు నర్సయ్య బాలికను రేప్ చేశాడని అతని పాన్ కార్డుతో కలిపి మెసేజ్‌లు వైరల్ చేయడం మొదలుపెట్టారు. ఈ తరహా తప్పుడు ప్రచారంతో బాధితుడు షాక్ తిన్నాడు.
6/ 8
తాను మధ్య తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తిని అని ..అవసరాల కోసం కొద్దిగా అప్పు చేస్తే ...దానికి రెట్టింపు కట్టమని వేధిస్తున్నారని క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్లు సరిగా స్పందిచకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు.
7/ 8
ఓవైపు లోన్ యాప్ నిర్వాహకుల టార్చర్ ..మరోవైపు బంధువులకు ఫోన్లలో తప్పుడు ప్రచారాన్ని భరించలేక నర్సయ్య నవీపేట పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
8/ 8
ఇప్పటికైనా పోలీసుశాఖ అధికారులు తన సమస్య పట్ల స్పందించి తనను వేధిస్తున్న లోన్ యాప్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని లేదంటే తనకు ఆత్మహత్యే గతి అని ఆవేదన వ్యక్తం చేశాడు.