తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రకటించిన ఐటీ పాలసీ ఐటి పరిశ్రమ అభివృద్ధికి దోహదం చేసిందని, తెలంగాణకి అద్భుతమైన పేరును, పెట్టుబడులను, ఉపాధి అవకాశాలను సంపాదించిపెట్టింది అని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. త్వరలో ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న ఐటీ పాలసీ స్థానంలో నూతన ఐటీ పాలసీ తీసుకురానున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈరోజు ఐటీ శాఖ విభాగాధిపతులతో జరిగిన సమీక్ష సమావేశంలో నూతన ఐటీ పాలసీకి సంబంధించి, అందులో పేర్కొనవలసిన అంశాల పైన మంత్రి కేటీఆర్ మార్గదర్శనం చేశారు.