ఏ ఒక్కరూ పుట్టుకతోనే గొప్పవాళ్లు కాదు. అలాగని ప్రయత్నం చేయకుండా ఓ ఒక్కరూ ఉన్నత శిఖరాలకు చేరుకోలేరు. జీవితంలో ఓ లక్ష్యం పెట్టుకొని దాన్ని సాధించుకోవడం అంటే ఎన్నో ఆటుపోటులు, ఎదురుదెబ్బలు,అపజయాలు, చిన్నచూపులు అవమానాలు భరిస్తూ ముందుకెళ్తేనే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలమని నిఖత్ జరీన్ నిరూపించారు.
2018లో హరియానాలో సీనియర్ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో క్యాంస పథకం.. 2018లో సెర్బియాలో జరిగిన అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నిలో బంగారు పతకం.. 2019లోబళ్లారిలో జాతీయ స్థాయి పోటీలో రజతం .. 2019 ఫిబ్రవరి 14 నుంచి 19 వరకు బల్గేరియాలో జరిగిన అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నిలో బంగారు పతకం.. 2019లో బ్యాంకాక్ లో అసియా బాక్సింగ్ చాంపియన్ షిప్ క్యాంస పతకం గెలుచుకుంది నిఖత్.
2019లో గౌహతిలో జరిగిన ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నిలో క్యాంసం.. 2019లో థాయ్ లాండ్ లో జరిగిన ఓపెన్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ రజితం.. 2019లో ఇటలీలో జరిగిన బాక్సింగ్ చాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్, 2019లో టోక్యో బాక్సింగ్ టోర్నమెంట్లో కాంస్యం, 2021 ఇస్తాంబుల్ బాక్సింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో కాంస్యం.. 2021లో హరియాణాలో జరిగిన జాతీయ బాక్సింగ్ టోర్నిలో గోల్డ్‌మెడల్‌తో బెస్ట్ బాక్సర్‌గా నిలిచారు.