తెలంగాణ వార్తలు, బ్రేకింగ్ న్యూస్, లైవ్ న్యూస్, లెటెస్ట్ న్యూస్, తెలుగు న్యూస్, లైవ్ అప్డేట్స్,నిజామాబాద్, పోలీసులు, " width="768" height="576" /> దొంగతనాలకు అడ్డుకట్ట వేసేందుకు గ్రామస్తులంతా ఒకటయ్యారు.. గ్రామ రక్షణ కొసం కమీటిగా ఏర్పడ్డారు.. కర్ర చేతబట్టి ఇంటికొకరు పోలీసుగా మారారు.. గ్రామాన్ని కంటికి రెప్పలా కాపాడుకున్నారు.. గ్రామ పొలిమేరల్లో రాత్రంతా కాపలా కాస్తున్నారు..
కులానికి ఒక్కరు చోప్పును రోజు గ్రామ కాపాలగా ఉండాలని తీర్మానం చేసుకున్నారు.. దీంతో గత 33 రోజులుగా ప్రతి రోజు 26 మంది గస్తీ కాస్తు గ్రామానికి పోలీసుగా వ్యవహరిస్తున్నారు.. గ్రామంలోని ప్రధాన కూడలి వద్ద రాత్రి పది గంటలకు అందరు చేరుకుని హజరు వేసుకుంటారు.. ఆ తరువాత ఐదు బృందాలుగా విడిపోయి.. గ్రామంలోకి వచ్చే ప్రదాన రోడ్ల వద్ద పహర కాస్తున్నారు..
రాత్రి పది తరువాత ఎవరు గ్రామంలోకి వచ్చిన వారిని ప్రశ్నించి వారి వివరాలు తెలుసుకున్న తరువాతనే పంపుతున్నారు.. ఏమైన ఆనుమానం వస్తే గ్రామ సర్పంచ్, గ్రామాబివృద్ది కమిటికి సమాచారం ఇస్తారు.. అలాగే పోలీసులకు 100 డయాల్ కు కాల్ చేస్తారు.. రాత్రి పది గంటల నుంచి ఉదయం 5 గంల వరకు గస్తీ నిర్వహిస్తారు..