Crime News: ఎంతపని చేశావమ్మా.. ఒకరి మీద కోపం వీళ్ల మీద చూపించి.. దారుణ ఘటన..
Crime News: ఎంతపని చేశావమ్మా.. ఒకరి మీద కోపం వీళ్ల మీద చూపించి.. దారుణ ఘటన..
Crime News: కుటుంబ కలహాలతో కుటుంబం మొత్తం చిన్నాబిన్నం అయిపోయింది. ఈ నేపథ్యంలో క్షణికావేశంలో పండ్ల జ్యూస్ లో పురుగుల మందు కలిపి పిల్లలకు తాపించింది. తర్వాత తాను కూడా తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.
కుటుంబ కలహాలతో కుటుంబం మొత్తం చిన్నాబిన్నం అయిపోయింది. ఈ నేపథ్యంలో క్షణికావేశంలో పురుగుల మందు తాగి పిల్లలకు తాపించింది. తర్వాత తాను కూడా తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
2/ 5
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమర్యాగడి తండాకు చెందిన హన్సీ, తన ఇద్దరు కూతుళ్లు పూజ ( 9, ) వెన్నెల (6 )కు పురుగుల మందును ఫ్రూట్ లో కలిపి తాగించింది.
3/ 5
అది తాగిన ఇద్దరు పిల్లలు పూజ, వెన్నెల పరిస్థితి విషమంగా ఉంది. తల్లి హన్సి (35) మాత్రం కామారెడ్డి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మద్య లో చనిపోయింది.
4/ 5
కొడుకు కీర్సింగ్ మాత్రం తల్లి ఇచ్చిన పురుగు మందు కలిపిన ఫ్రూట్ జ్యూస్ తినకుండా పారిపోవడంతో అతడికి ఎటువంటి ఆపద రాలేదు.
5/ 5
భార్యా భర్తల అయిన హన్సి , గోవింద్ ల మధ్య తరచూ గొడవలు జరిగేవి అని గ్రామస్తులు తెలిపారు. భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.