NAZIMABAD SRAVANTHI A GIRL COMMITS SUICIDE MONTHS AFTER INTER FAITH MARRIAGE IN KAMAREDDY FAMILY ALLEGES MURDER BA NZB
Telangana: ఓ స్రవంతి విషాద గాథ.. ప్రేమ కోసం మతాంతర వివాహం.. ఆరు నెలల్లోనే ఇలా జరిగింది..
పెళ్లి తరువాత స్రవంతి తన పేరును షేక్ సమీరా గా మార్చుకుంది. అయితే రెండు నెలల నుంచి షేక్ సమీరా తన భర్తతో కలిసి వేరే కాపురం పెట్టారు. నిన్న షేక్ సమీరా అలియాస్ స్రవంతి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
ఆ ఇద్దరి మతాలు వేరు. ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంది. భవిషత్తుపై ఎంతో నమ్మకంతో సంసార జీవితాన్ని ప్రారంభించింది. ఆరు నెలలు గడువకుండానే ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు మాత్రం ఇది ముమ్మాటికి అత్తారింటి వారు హత్య చేశారని ఆరోపిస్తున్నారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది.
2/ 4
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరా నగర్ కాలనీ లో నివాసముండే స్రవంతి (19), గుమస్తా కాలనీకి చెందిన సల్మాన్ లు ఇద్దరు ప్రేమించుకున్నారు. ఇద్దరి మతాలు వేరైనా వారి ప్రేమను పెళ్లిగా మార్చుకున్నారు. 2021 జనవరి 7న వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు.
3/ 4
పెళ్లి తరువాత స్రవంతి తన పేరును షేక్ సమీరా గా మార్చుకుంది. అయితే రెండు నెలల నుంచి షేక్ సమీరా తన భర్తతో కలిసి వేరే కాపురం పెట్టారు. నిన్న షేక్ సమీరా అలియాస్ స్రవంతి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
4/ 4
ఈ విషయం తెలిసిన మృతురాలి బంధువులు మాత్రం తమ కూతురు ఒంటిపై గాయాలున్నాయి. అత్త, మామ, భర్త తమ కుమార్తెను కొట్టి చంపారని అనుమానం వ్యక్తం చేశారు. వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.