NAZIMABAD PEOPLE OF KAMAREDDY DISTRICT ARE STRUGGLING WITH MIGRATORY BATS SNR NZB
Kamareddy: నైట్ టైమ్ ఆ రోడ్డుపై వెళ్తే అంతే ..వాటిని భరించడం ఎవరి వల్ల కాదంట
Kamareddy:ఏ గ్రామానికైనా స్థానికంగా ఉండే వ్యక్తులు, అసాంఘిక శక్తులతో సమస్యలు ఉంటాయి. కాని కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి పట్టణానికి మాత్రం వలస వచ్చిన పక్షలతో పెనుప్రమాదం ఏర్పడింది. వేల సంఖ్యలో వచ్చిన వాటిని చూస్తుంటే..అవి చేసే శబ్ధానికి స్థానికులు భయంతో వణికిపోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఎల్లారెడ్డి ప్రజల్ని అంతగా భయపెడతున్నవి ఏమిటో తెలుసా.
వేసవి కాలం సెలవులు వస్తే పట్టణాల్లోని బందువులు గ్రామాల్లోని చుట్టాల ఇళ్లకు వస్తారు. కానీ కామారెడ్డి జిల్లాకు మాత్రం వేసవి వచ్చిందంటే చాలు అనుకోని అతిథులు వస్తాయి. అవి వస్తున్నాయంటే చాలు స్థానికుల గుండెల్లో ఒకటే దడ.
2/ 15
పక్షుల రూపంలో చుట్టం చూపుగా వచ్చిన గబ్బిలాలు నాలుగు నెలల పాటు చెట్లపైనే మకాం వేస్తాయి. రాత్రి అయితే చాలు వింత శబ్దాలు చేస్తూ చుట్టు పక్కల గ్రామాల ప్రజల్ని భయపెడతున్నాయి.
3/ 15
ఇప్పటి వరకు విదేశీ వలస పక్షులు వలస రావడం గురించి మాత్రమే విన్నాం. కానీ కామారెడ్డి జిల్లాకు దేశీయ గబ్బిలాలు వలస వచ్చాయి. ఒకటి రెండు కాదు..వేల సంఖ్యలో వచ్చి పట్టణానికి చివరలో తిష్టవేసి స్థానికులను ఇబ్బంది పెడుతున్నాయి.
4/ 15
ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు కాని మర్రి చెట్టుకు తల కిందులుగా వేలాడుతూ వందల సంఖ్యలో వాలిపోయాయి. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణానికి వందల సంఖ్యలో గబ్బిలాలు వలసొచ్చాయి. ఇప్పుడు ఇవే అక్కడి జనానికి పెద్ద తలనొప్పిగా మారాయి.
5/ 15
ఎల్లారెడ్డి - హైదరాబాద్ ప్రధాన రహదారిలో ఉండే పెద్ద చెరువు మర్రి చెట్లపై తల కిందులుగా వేలాడుతూ.. ఆవాసం ఏర్పాటు చేసుకున్నాయి వందల సంఖ్యలో వలస వచ్చిన గబ్బిలాలు.
6/ 15
పెద్ద చెరువుకు ఆనుకుని ఆరు మర్రి చెట్లు ఉండగా...వాటన్నింటిని తమ ఆవాసంగా ఆక్రమించుకున్నాయి వలస వచ్చిన గబ్బిలాలు. చెట్లపై ఎటూ చూసిన వందల సంఖ్యలో గబ్బిలాలతో నిండిపోయాయి కనిపిస్తున్నాయి. ఏటా వేసవిలో వచ్చే ఈ గబ్బిలాలు నాలుగు నెలల పాటు ఇక్కడే మకాం వేస్తాయి.
7/ 15
వేసవి కాలం అయిపోయి చినుకులు కురిస్తే చాలు.. ఒక్కసారిగా మాయం అవుతాయని గ్రామస్ధులు చెబుతారు. ఐదు, ఆరు సంవత్సరాలుగా గబ్బిలాలు తమ గ్రామానికి వలస వస్తున్నాయంటున్నారు.
8/ 15
చెట్లపై ఉన్న గబ్బిలాలను చూసి స్థానికులతో పాటు రోడ్లపై వెళ్లే వాహనదారులు భయపడిపోతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఆ రోడ్డువైపు వెళ్లాలంటనే అవి చేసే శబ్ధాలు వినలేక భయంతో వణికిపోతున్నారు.
9/ 15
కొందరు గ్రామస్తులు సాహసం చేసి మర్రి చెట్ల వైపు ఉన్న మార్గంలో వెళితే గబ్బిలాల శబ్ధంతో ఊహించని రీతిలో కిందపడి గాయాలపాలైనట్లుగా స్థానికులు చెబుతున్నారు. అందుకే గబ్బిలాల పేరు చెబితే భయపడుతున్నారు.
10/ 15
పెద్ద చెరువు సుందరీకరణ పనుల్లో భాగంగా రోడ్లను విస్తరించారు. రోడ్డుకు ఓ వైపు భారీ మర్రి వృక్షాలు ఉన్నాయి. ఆ చెట్లపై వందల సంఖ్యలో గబ్బిలాలు వేసవి రోజుల్లో అతిథుల్లా వస్తుంటాయని గ్రామస్దులంటున్నారు.
11/ 15
గబ్బిలాలు ఊరి పొలిమేర చెట్ల వైపు రావడం అరిష్టమో.. అదృష్టమో తెలియదు కాని అంతరించిపోతున్న గబ్బిలాలు గుంపులుగా రావడం చూస్తుంటే కొంత సంతోషంగా ఉన్నప్పటికి వాటితో జరిగే ప్రమాదాల వల్లే భయపడుతున్నారు.
12/ 15
గుంపులుగా చెట్లపై చేరిన గబ్బిలాలు వింత శబ్దాలను వింటే ఆ భయం ఎల్లారెడ్డి- హైదరాబాద్ రహదారిపై రాత్రి వేళల్లో వాహనాలపై వెళ్లలేని పరిస్థితి నెలకొందంటున్నారు. కాబట్టి గ్రామస్తుల బాధను ఆలకించి వాటిని దూర ప్రాంతాలకు తరలించాలని గ్రామస్దులు కోరుతున్నారు.
13/ 15
ఆ ఊరుకు అతిథుల్లా వచ్చిన గబ్బిలాలతో గ్రామస్దులు కొంచెం ఇష్టంగా కొంచెం కష్టంగా భరిస్తున్నారు. అటవీశాఖ అధికారులు గబ్బిలాల బెడద నుంచి తమ పట్టణాన్ని కాపాడాలని కోరుతున్నారు.
14/ 15
ఎల్లారెడ్డి పట్టణ ప్రాంతానికి సమీపానికి వలస వచ్చి ఇబ్బందులకు గురి చేస్తున్న గబ్బిలాల నుంచి స్థానిక ప్రజలకు ఫారెస్ట్ అధికారులు విముక్తి కలిగిస్తారో లేదో చూడాలి.
15/ 15
చుట్టం చూపుగా వచ్చే గబ్బిలాలపై చూపించే జాలి రోడ్డుపై రాత్రి, పగలు సమయాల్లో వాహనాలు, టూవీలర్‌పై వెళ్లే వారి భయాన్ని కాస్త అర్ధం చేసుకోమని కోరుతున్నారు.