ఫలితంగా కల్లాల్లోని వరి దాన్యం, కుప్పలు పోసిన పంట పూర్తిగా తడిసి ముద్దయింది. మరో కోన్ని చోట్ల వరదలకు వరి ధాన్యం కొట్టుకుపోయింది. వరి ధాన్యం కుప్పల మధ్య నీరు చేరడంతో దేనికి పనికి రాకుండా పోయింది.నిజామాబాద్ రూరల్ జిల్లాలోని మాక్లూర్, ఇందల్వాయి, దర్పల్లి మండరాల్లోని గ్రామాల్లో ధాన్యం పూర్తిగా తడిసి పోయింది. మోపాల్ మండలం మంచిప్ప గ్రామం.. నందిపేట మండలం లోని ఆకాల వర్షం రైతుల కంట కన్నీము మిగిల్చింది.
అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణశాఖ సూచనలతో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు అధికారులు.కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యాన్ని రాశులుగా ఒకచోటికి చేర్చి రాత్రివేళల్లో తప్పనిసరిగా టార్పాలిన్లు కప్పాలని తెలిపారు. తడిచిన ధాన్యాన్ని కూడా బాగా ఆరబెట్టిన అనంతరం తిరిగి బస్తాల్లో నింపాలని సూచించారు.