Telangana News: మమ్మల్ని దుబాయ్ రానివ్వడంలేదంటూ.. గల్ఫ్ కార్మికుల ఆందోళన.. ఎందుకంటే..

Telangana News: వ్యాక్సిన్ కోసం ఉదయం నాలుగు గంటల నుంచి సెంటర్ వద్ద బారులు తీరారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్ కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్ వద్ద ఉదయం నాలుగు గంటల నుంచి గల్ఫ్ కార్మికులు బారులు తీరారు. అయితే 9:30 గంటలకు వచ్చిన అధికారులు ఈ రోజు వ్యాక్సినేషన్ లేదని చెప్పారు. దీంతో కార్మికులు ఆందోళన బాట పట్టారు.