హీరో నందమూరి బాలకృష్ణ కుమార్తె, టీడీపీ నేత నారా లోకేష్ సతీమణి నారా బ్రహ్మణి కీలక బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు బ్రహ్మిణి కుటుంబ వ్యాపారాలు, ఎన్టీఆర్ ట్రస్ట్ వ్యవహారాలు చూసుకుంటున్నారు. అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు కూడా నిర్వహిస్తున్నారు. తాజాగా బ్రహ్మిణి సామాజిక సేవ పరంగా తండ్రి బాటలో నడిచేందుకు రెడీ అయ్యారు.
"నా ప్రియమైన కుమార్తె నారా బ్రాహ్మణిని మా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కుటుంబానికి స్వాగతిస్తున్నాను. కొత్తగా ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా బాధ్యతు చేపట్టిన ఆమెకు అభినందనలు. రోగులు వారి క్యాన్సర్‌పై విజయం సాధించేలా పోరాడటానికి సహాయం చేద్దాం. అదే విధంగా ఈ రోజు ఇంటర్నేషనల్ చైల్డ్ హుడ్ క్యాన్సర్ డే. పిల్లవాడికి క్యాన్సర్ ఉన్నట్లు గుర్తించినప్పుడు అది ఆ కుటుంబాన్ని అప్రమత్తం చేస్తోంది.(Image- Facebook/Nandamuri Balakrishna)
మనం బలంగా ఉండి ఈ పరిస్థితిపై కలిసి పోరాడాలి. పీడియాట్రిక్ క్యాన్సర్‌తో పోరాడుతున్న అతి చిన్న యోధులుకు నేను సెల్యూట్ చేస్తున్నాను.. అలాగే వారి కోసం పోరాడుతున్న కుటుంబాలకు, వైద్య సిబ్బందికి, నిపుణులు కూడా. ఆ చిన్నారులకు మంచి ఆరోగ్యం మరియు క్యాన్సర్‌కు వ్యతిరేకంగా వారు చేసిన పోరాటంలో విజయం సాధించాలని నేను కోరుకుంటున్నాను" అని పేర్కొన్నారు.(Image- Facebook/Nandamuri Balakrishna)