Nalgonda: సేంద్రియ పద్దతిలో సాగుతోనే రైతు రాజు అయ్యేది..రుజువు చేస్తున్న నల్గొండ జిల్లా యువరైతు
Nalgonda: సేంద్రియ పద్దతిలో సాగుతోనే రైతు రాజు అయ్యేది..రుజువు చేస్తున్న నల్గొండ జిల్లా యువరైతు
Nalgonda: పంటల్లో చీడపీడల నివారణ, అధిక దిగుబడి అంటూ రైతులకు రసాయన ఎరువులు అలవాటు చేశారు తయారీ సంస్థలు. రసాయన ఎరువుల కారణంగా భూసారం తగ్గిపోవడంతో పాటు పంట దిగుబడి పడిపోయింది. దీంతో రైతులు కనీస లాభాలు కూడా పొందలేకపోతున్నారు.
వ్యవసాయాన్ని లాభాల పట్టించడానికి రైతులు నానాతంటాలు పడుతున్నారు. ఏటికేడు వ్యవసాయంలో పెట్టుబడులు పెరగడంతో పాటు దిగుబడి తగ్గుతూ, మద్దతు ధర కూడా దక్కకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అలాంటి ఇబ్బందుల నుంచి విముక్తి కోసమే యువ రైతులు వినూత్నంగా ఆలోచించాడు.
2/ 12
పంటల్లో చీడపీడల నివారణ, అధిక దిగుబడి అంటూ రైతులకు రసాయన ఎరువులు అలవాటు చేశారు తయారీ సంస్థలు. దీంతో దశాబ్దాలుగా రసాయనిక ఎరువులు వాడి రైతులు నష్టపోతున్నారు. రసాయన ఎరువుల కారణంగా భూసారం తగ్గిపోవడంతో పాటు పంట దిగుబడి పడిపోయింది. దీంతో రైతులు కనీస లాభాలు కూడా పొందలేకపోతున్నారు.
3/ 12
ఈనేపథ్యంలో కొందరు రైతులు సేంద్రియ వ్యవసాయానికి మొగ్గు చూపుతున్నారు. రసాయనాల వాడకంతో భూసారం కోల్పోయి దిగుబడులు తగ్గిపోతున్నాయని భావించిన నల్గొండ జిల్లా తుంగతుర్తి మండలం కర్విరాల గ్రామానికి చెందిన వెలుగు అనూక్ అనే యువ రైతు సేంద్రియ పంటల వైపు దృష్టి సారించాడు.
4/ 12
ఇక సేంద్రియ సాగులో మంచి లాభం ఉండడంతో ఆ పంటల కోసం ఆవు పేడ, గో మూత్రంతో జీవామృతాన్ని తయారు చేయడం మొదలెట్టాడు. ఒక్కొ పంటకు ఐదు సార్లు జీవామృతాన్ని అందిస్తారు.
5/ 12
అనూక్ తండ్రి నర్సయ్య నుంచి వ్యవసాయం నేర్చుకుని సాంప్రదాయ పంటలు సాగు చేసేవాడు. రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం వలన పంటల దిగుబడి తగ్గడంతో పాటు పెట్టుబడి వ్యయం పెరిగిపోతున్నట్టు గుర్తించాడు. రసాయనాల వలన భూసారం తగ్గిపోతుందని గ్రహించిన అనూక్..సేంద్రియ పద్దతిలో సాగు చేయాలని ఆలోచించాడు.
6/ 12
ప్రముఖ వ్యవసాయ నిపుణుడు శుభాష్ పాలేకర్ ద్వారా సేంద్రియ పద్ధతుల్లో సాగు గురించి తెలుసుకున్నాడు. దీంతో తమకున్న ఐదు ఎకరాల్లో తండ్రితో కలిసి సేంద్రియ పంటలు పండించాలని నిర్ణయించుకున్నాడు. అందుకు కావాల్సి న రెండు దేశవాళీ ఆవులను కొనుగోలు చేశాడు.
7/ 12
ఒక్కొ ఎకరంలో.. ఒక్కొ రకమైన పంట సాగు చేశాడు. వరితో పాటు కూరగాయలు, పండ్ల తోటలు వేశాడు. తాను అనుకున్నట్టుగానే పంట దిగుబడి పెరిగింది. అనంతరం ఆ పంటలను తానే స్వయంగా మార్కెట్లో విక్రయించడం అలవాటు చేసుకున్నాడు.
8/ 12
కొన్ని సేంద్రియ రసాయనాలను స్వయంగా తయారుచేసి పంటలకు పిచికారి చేస్తున్నాడు అనూక్. సేంద్రియ పద్దతిలో పండించిన పంటలను కూరగాయలను స్వయంగా గ్రామీణ మార్కెట్లలో విక్రయిస్తూ లాభాలు ఆర్జిస్తున్నాడు.
9/ 12
సంతలో దుకాణం ఏర్పాటు చేసి.. ఆప్రాంతంలో 'సేంద్రియ పద్దతిలో సాగు కూరగాయలు 'అని ప్లేక్సీ ఏర్పాటు చేశాడు. దీంతో వినియోగదారులు సైతం సేంద్రియ పంట ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని యువరైతు అనూక్ తెలిపాడు.
10/ 12
ప్రస్తుతం తన ఐదెకరాల పొలంలో బెండ, గోరుచిక్కుడు, టమాట, మొక్కజొన్నలు ఇతర కూరగాయల సాగు చేస్తున్నాడు యువరైతు అనూక్. నల్గొండ జిల్లాకు చెందిన ఓ యువ రైతు సేంద్రియ పద్దతిలో గో ఆధారిత సాగు చేస్తూ లాభాలు గడించడంపై సాటి రైతులు కూడా ఆదర్శంగా తీసుకుంటున్నారు.
11/ 12
సాగువిధానంలో మెళకువలు, వాణిజ్య పంటల సాగుపై దృష్టి, సేంద్రియ సాగు విధానం పాటిస్తే రైతు రాజుగా మారడం ఖాయమని నల్లగొండ జిల్లాకు చెందిన యువరైతు అనూక్ నిరూపిస్తున్నాడు.
12/ 12
ఏటా ఒకే రకమైన పంట సాగు చేయడం కంటే ..ఉన్న ఐదెకరాల్లోనే వేర్వేరు పంటలు వేస్తూ..ఒక్కో పంట దిగుబడి దానిపై వస్తున్న రాబడి చూసుకొని వ్యవసాయం చేస్తే బాగుంటుందని అనూక్ చెబుతున్నారు.