ఇటీవల నల్గొండ (Nalgonda) జిల్లా చౌటుప్పల్ (Choutuppal) మండలం లక్కారానికి చెందిన జనసేన కార్యకర్త కొంగరి సైదులు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. దీంతో సైదులు కుటుంబాన్ని పరామర్శించారు పవన్ కల్యాణ్. నల్లగొండకు బయలుదేరిన పవన్ కల్యాణ్‌కు హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ వద్దనున్న అక్కపురి చౌరస్తా వద్ద జనసైనికులు, పవన్ అభిమానులు ఘన స్వాగతం పలికారు.