Munugodu: మునుగోడులో ప్రధాన పార్టీల తరపున నాయకులు కాసుల వర్షం కురిపిస్తూ ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు. అయితే వాళ్ల ఉచ్చులో పడవద్దని కరీంనగర్ చెందిన కోట శ్యామ్ కుమార్ అనే సామాజిక కార్యకర్త వెంకటేశ్వరస్వామి వేషాధారణలో ప్రచారం చేస్తున్నాడు.
ఎక్కడ ఎన్నికలు జరుగుతున్న ముందుగా ఓటర్లు ఆలోచించేది ఏ పార్టీ ఎక్కువ డబ్బులు ఇస్తుంది. ఏ పార్టీ నాయకుడు ఓటు కోసం ఎక్కువ కానుకలు ఆఫర్ చేస్తాడని ఎదురుచూస్తుంటారు. నిస్సిగ్గుగా తమకు కావాల్సింది..వేరే పార్టీ నేత ఇంత ఇస్తానన్నాడు అని మరీ అడిగి మరీ డబ్బులు తీసుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి.
2/ 8
ఎన్నికల సమయంలో ఓటరు డబ్బులకు అమ్ముడుపోవద్దని ..అమూల్యమైన ఓటును నోటుకు ఆశపడి వృధా చేసుకోవద్దని విద్యావంతులు, ఎన్నికల అధికారులు, మేధావులు అవగాహన కల్పించినా, బ్రతిమిలాడిన ప్రయోజనం ఉండదు.
3/ 8
అందుకే మునుగోడు ఉపఎన్నికల వేళ సాక్షాత్తు ఆ ఏడు కొండల వెంకటేశ్వర్లస్వామి వచ్చి ఓటర్లకు కనువిప్పు కలిగించాలని ప్రయత్నించాడు. కష్టాలు ఎవరికి ఊరికే రావు ఓటును అమ్ముకుంటనే వస్తాయంటూ ఓ ప్లకార్డు పట్టుకొని మరీ అవగాహన కల్పించాడు.
4/ 8
మునుగోడులో ప్రధాన పార్టీల తరపున నాయకులు కాసుల వర్షం కురిపిస్తూ ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు. అయితే వాళ్ల ఉచ్చులో పడవద్దని కరీంనగర్ చెందిన కోట శ్యామ్ కుమార్ అనే సామాజిక కార్యకర్త వెంకటేశ్వరస్వామి వేషాధారణలో ప్రచారం చేస్తున్నాడు.
5/ 8
ఓటు ప్రాధాన్యత గురించి వివరిస్తూ ... ఓటుకు అమ్ముడుపోతే ఏ సమస్య గురించి ప్రజాప్రతినిధుల్ని నిలదీయలేమని కళ్లకు కట్టినట్లుగా చెబుతున్నాడు శ్యామ్ కుమార్. ఒక్క మునుగోడులోనే కాదు నియోజకవర్గంలోని పూటకు ఒక గ్రామం సెలక్ట్ చేసుకున్నాడు.
6/ 8
ప్రతి షాపు దగ్గరకు వెళ్లి చేతిలో ఉన్న ప్లకార్డును చూపిస్తూ దానిపైన ఉన్న అక్షరాలను చూపిస్తూ ...చదివి వినిపిస్తున్నాడు. కష్టాలు ఎవరికీ ఊరికే రావు ఓట్లు అమ్ముకుంటేనే వస్తాయంటూ దయచేసి నోటుకు ఓటు అమ్ముకోవద్దని కోరుతున్నాడు.
7/ 8
ఏ స్వార్ధం లేకుండా కేవలం ప్రజల ఓటు హక్కు దుర్వినియోగం కాకుండా ఉండాలనే ఓ మంచి సంకల్పంతో సాధారణంగా చెబితే ఎవరూ వినరని ఆలోచించి ఈ విధంగా దేవుడి వేషం వేశానని శ్యామ్ కుమార్ తెలిపాడు.
8/ 8
కనీసం తన ముఖం చూసి కాకపోయినా దేవుడిపైన భక్తితో అయినా ఎంతో కొంత మంది డబ్బులు తీసుకోకుండా తమ అమూల్యమైన ఓటును తమకు నచ్చిన వాళ్లకు, ప్రజలకు మంచి చేసే వాళ్లకు వేస్తారని ఆశిస్తున్నానని చెప్పాడు శ్యామ్ కుమార్.