RGV: రాంగోపాల్ వర్మకు షాకిచ్చిన నల్గొండ జిల్లా కోర్టు
RGV: రాంగోపాల్ వర్మకు షాకిచ్చిన నల్గొండ జిల్లా కోర్టు
సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ కరోనా కాలంలో మరిన్ని సంచనాలు సృష్టిస్తున్నారు. వారానికో కాంట్రవర్సీ సినిమా తీస్తూ నిత్యం వార్తల్లో ఉంటున్నారు. ఇప్పటికే పవర్ స్టార్ సినిమాతో రచ్చ చేసిన ఆర్జీవీ.. ఇప్పుడు ప్రణయ్ హత్య కేసు ఆధారంగా మర్డర్ సినిమా తీస్తున్నారు.
సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ కరోనా లాక్డౌన్లో మరిన్ని సంచనాలు సృష్టిస్తున్నారు. వారానికో కాంట్రవర్సీ సినిమా తీస్తూ నిత్యం వార్తల్లో ఉంటున్నారు. ఇప్పటికే పవర్ స్టార్ సినిమాతో రచ్చ చేసిన ఆర్జీవీ.. ఇప్పుడు ప్రణయ్ హత్య కేసు ఆధారంగా మర్డర్ సినిమా తీస్తున్నారు.
2/ 7
వర్మ సినిమా మర్డర్‌పై ప్రణయ్ భార్య అమృత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అనుమతులు లేకుండా తన కథ ఆధారంగా సినిమా తీస్తున్నారంటూ నల్గొండ జిల్లా కోర్టులో పిటిషన్ వేశారు.
3/ 7
మర్డర్ సినిమా విడుదలను నిలుపదల చేయాలని, చిత్ర ప్రచారాన్ని వెంటనే ఆపమని కోరుతూ అమృత కోర్టును కోరారు. దీనిపై విచారించిన నల్గొండ కోర్టు రాంగోపాల్ వర్మకు షాకిచ్చింది.
4/ 7
మర్డర్ సినిమా నిలిపివేయాలని నల్గొడ జిల్లా కోర్టు ఆదేశించిది. అమృత పిటిషన్‌పై విచారణ ముగిసే వరకు సినిమాను విడుదల చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.
5/ 7
మర్డర్ మూవీ ట్రైలర్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. త్వరలోనే పూర్తి చిత్రాన్ని తన ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆర్జీవీ వరల్డ్ థియేటర్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు వర్మ.
6/ 7
ఐతే ఇది అమృత-ప్రణయ్ స్టోరీ కాదని.. ఓ నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నానని వర్మ అన్నారు. వార్తా కథనాల ఆధారంగానే మూవీని తీస్తున్నామని, దీనికి ఎవ్వరి అనుమతి అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు.
7/ 7
ఈ చిత్రం నుంచి ఓ పాటను కూడా విడుదల చేశాడు. పిల్లలను ప్రేమించడం తప్పా.. అంటూ సాగే ఆ పాటను స్వయంగా రాంగోపాల్ వర్మే పాడారు.