తెలంగాణ న్యూస్, లైవ్ అప్డేట్స్, బ్రేకింగ్ న్యూస్, లైవ్ న్యూస్, ఆన్లైన్ న్యూస్, ఆదిలాబాద్, నాగోబా జాతర, నాగోబా , " width="1200" height="800" /> మెస్రం వంశ గిరిజనుల ఆరాధ్య దైవమైన నాగోబా కొలువున్న జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లోని ఆలయం సరికొత్త శోభను సంతరించుకుంటోంది. తమ సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్రను ప్రతిబింబించేలా అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో ప్రత్యేక తరహాలో ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు.
ఇటీవల తెలంగాణ రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, గిరిజన సంక్షెమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ నాగోబా ఆలయాన్ని సందర్శించి నిర్మాణం పనులను పరిశీలించారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందిన నాగోబా సన్నిధిలో ప్రతియేటా పుష్య అమావాస్య రోజు మహాపూజ చేసి జాతరను ప్రారంభిస్తారు.