Corona Wedding: ఇన్ స్టాగ్రామ్ లైవ్ లో పెళ్లి.. ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే.. ఆకట్టుకొంటున్న మై విలేజ్ షో ఫేం అనిల్ జీల లగ్నపత్రిక..
Corona Wedding: ఇన్ స్టాగ్రామ్ లైవ్ లో పెళ్లి.. ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే.. ఆకట్టుకొంటున్న మై విలేజ్ షో ఫేం అనిల్ జీల లగ్నపత్రిక..
Corona Wedding: కక్కు వచ్చినా.. కళ్యాణం వచ్చిన ఆగదు అంటారు. కళ్యాణ గడియలు వచ్చాయంటూ అందరిలా కాకుండా డిఫరెంట్ గా ఆలోచించాడు. కరోనా నిబంధనలకు అనుగుణంగా లగ్న పత్రికను కొట్టిచ్చారు. దాని ప్రకారమే పెళ్లి చేసుకుంటున్నారు. ఇన్ స్టాగ్రామ్ లైవ్ లో మే 1 న పెళ్లి అంటూ మై విలేజ్ షో ఫేం అనిల్ జీల తన యూ ట్యూబ్ ఛానల్ వీడియో లో తెలిపాడు.
ఎవరి పెళ్లి పత్రికలో అయినా శ్రీరస్తు.. శుభమస్తు.. అవిఘ్నమస్తు అంటూ రాయిస్తారు. కానీ ఈ కరోనా పెళ్లి పత్రికలో మాత్రం శానిటైజర్ ఫస్టు! మాస్క్ మస్టు !!సోషల్ డిస్టెన్స్ బెస్ట్ ! అంటూ కరోనా నిబంధనల గురించి తెలియజేశారు. (Image credit: twitter)
2/ 7
లగ్గం మే నెల 1వ తారీఖు శనివారం పొద్దు పొడిచినంక 8 గంటలకు ఇన్ స్టా లైవ్ లో చూడగలరని తెలియజేశాడు. వధూవరులకు కరోనా నెగిటివ్ అని కూడా పత్రికలో పేర్కొనడం గమనార్హం. (Image credit: twitter)
3/ 7
పెండ్లిని ఆన్లైన్లో చూసి ఆశీర్వదించాలని, విందు మాత్రం ఎవరింట్లో వారే తినాలని.. బరాత్ కూడా ఉందని, కానీ ఎవరింట్ల వాళ్లు పాటలు పెట్టుకొని ఎగరాలని చెబుతూ ఈ కార్డ్‌ను ఫన్నీగా రూపొందించారు. (Image credit: twitter)
4/ 7
వాటిని మాకు పంపిస్తే ఒక వీడియో రూపొందించి యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేస్తామన్నారు. కట్నాలు సమర్పించేవాళ్లు ఫోన్ పే, గూగుల్ పేల ద్వారా పంపించవచ్చంటూ క్యూఆర్ కోడ్ ను ముద్రించాడు. (Image credit: twitter)
5/ 7
ఇలా వసూలైన మొత్తాన్ని కరోనాతో బాధపడుతున్న వారికి ఆర్థిక సాయంగా అందిస్తామని పత్రికలో చెప్పడం ఆకట్టుకుంటోంది. (Image credit: twitter)
6/ 7
ఈ పెళ్లిని మై విలేజ్ షో టీమ్ లైవ్‌లో కవర్ చేస్తుందన్నారు. ఇలా అనిల్ తన వెడ్డింగ్ కార్డ్‌తో అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుత పరిస్థితులను ప్రతిబింబించేలా ‘కరోనా కాలంలో లగ్గం పత్రిక’అని పెళ్లి పత్రికపై రాసి ఉండటం విశేషం. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
ఈ క్రియేటివ్ పెళ్లి పత్రిక నెట్లో వైరల్ అవుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)