ములుగు జిల్లా వ్యాప్తంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా పలు ప్రాంతాల్లో ప్రభుత్వ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు వేడుకల్లో పాల్గొన్నారు. ఆజాది కా అమృత్ మహోత్సవంలో భాగంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలతో స్వతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్ రావు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ములుగు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యే సీతక్క ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో జెండా ఆవిష్కరించిన అనంతరం సీతక్క మాట్లాడుతూ అనేకమంది త్యాగాల ఫలితమే ఈరోజు మనం స్వతంత్ర వేడుకలు జరుపుకుంటున్నామని వారిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకొచ్చారు.
ములుగు జిల్లా ఏనాగారం ఐటీడీఏ కార్యాలయంలో 75వ స్వతంత్ర దినోత్సవ వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఐటిడిఏ పీఓ అంకిత్ ముఖ్య అతిధిగా విచ్చేయగా గిరిజన స్కౌట్ ార్థులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో గిరిజన ార్థులు గిరిజన సాంస్కృతిక నృత్యాలతో పాటలతో వేడుకలు నిర్వహించారు.
స్వాతంత్య్ర దినోత్సవం నాడు ప్రతి ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయంలోనూ పాఠశాలలోనూ ఇతర సంస్థలు కూడా ఘనంగా జెండా పండుగను నిర్వహిస్తారు. ఒక రైతు తన పొలంలోనూ నాటు వేసేందుకు వచ్చిన మహిళలతో కలిసి జాతీయ జెండా ఆవిష్కరించి జాతీయ గీతం ఆలపించి వారికి మిఠాయిలు కూడా పంచిపెట్టి జెండా పండుగ జరుపుకున్నారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రా గ్రామంలో రైతు ఈ వేడుకలు నిర్వహించాడు.