ఇటీవల కురిసిన వర్షాలకు ఎలిశెట్టిపల్లి గ్రామంలో నివసిస్తున్న వాళ్లలో పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు పీకల్లోతు నీళ్లలో ప్రాణాల్ని పణంగా పెట్టి రోడ్డు దాటాల్సిన పరిస్థితి ఏర్పడింది. మండల కేంద్రానికి అత్యంత సమీపంలో ఉన్న ఎలిశెట్టిపల్లి గ్రామానికి బ్రిడ్జి నిర్మిస్తేనే తమ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందంటున్నారు.
గ్రామం నుంచి ఎక్కడికి వెళ్లాలన్నా...కాలి నడక తప్ప మరో మార్గం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దట్టమైన అడవిలోనే నడవాల్సిన పరిస్థితి నెలకొంది. మండల కేంద్రమైన ఏటూరునాగారం వెళ్లే రోడ్ల పరిస్థితి మరింత దారుణంగా ఉందంటున్నారు. దయచేసి అధికారులు, పాలకులు తమ గోడు ఆలకించి రోడ్డు సౌకర్యం లేదా వంతెన నిర్మించాలని వేడుకుంటున్నారు.