Telangana: ఏజెన్సీలో జరుగుతున్న మూడవ రాష్ట్రస్థాయి ఏజెన్సీ క్రీడల్లో క్రీడాకారుడు హోరాహోరీగా తలపడుతూ పతకలా వేట కొనసాగుతుంది రెండవ రోజు జరిగిన క్రీడలలో ఇరుసెట్ల మధ్య హోరాహోరి పోటీలు జరుగుతున్నాయి విద్యార్థులు నువ్వా నేనా అన్నట్టు తలపడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.
మూడవ రాష్ట్ర స్థాయి ఏజెన్సీ క్రీడలకు ఏటూరు నాగారంలోని కొమరం భీం స్టేడియం ఆతిథ్యం ఇస్తుంది దీనిలో సంబంధించి దాదాపు 1500 మంది విద్యార్థులకు పైగా ఈ క్రీడలలో పాల్గొంటున్నారు.
2/ 9
తెలంగాణలోని మూడు ఐటీడీఏలు ఐటిడిఏ భద్రాచలం ఐటిడిఏ ఉట్నూర్ నాగారం సంబంధించిన క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొంటున్నారు. ఈ క్రీడా పండుగలో అధికారులు క్రీడాకారులు ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
3/ 9
క్రీడాకారులు ఉత్సాహం నింపడం కోసం ఐటీడీఏ పీవో ఆధ్వర్యంలో క్యాంపు ఫైర్ ను కూడా నిర్వహించి క్రీడాకారులు ఉత్సాహం నింపడం జరిగింది.
4/ 9
అనంతరం కొమురం భీం స్టేడియం ప్రాంగణంలో విద్యార్థులు సంప్రదాయ నృత్యాలు గిరిజన నృత్యాలతో అధికారులను అలరించారు.
5/ 9
క్రీడలలో గెలుపు ఓటములు సహజం కానీ క్రీడా భావం పెంపొందించుకోవడం క్రీడాకారులు క్రమశిక్షణతో విజ్ఞానాన్ని పెంచుకోవడం చాలా ముఖ్యమని అధికారులు సూచిస్తున్నారు.
6/ 9
దీనిలోభాగంగా కొమురం భీం స్టేడియంలో ఏర్పాటు చేసిన స్టేడియం పనులలో క్రీడాకారులకు కొంత చేదు అనుభవం ఎదురవుతుంది.
7/ 9
ఏర్పాటులో భాగంగానే మైదానంలో ఎర్రమట్టి మొరం పోయడం కంకరలో క్రీడలను ఆడాలంటే విద్యార్థులు గాయాల పాలవుతున్నారుఅనేక మందికి గాయాలు కూడా అయ్యాయి. రాష్ట్ర స్థాయి క్రీడలను ఈ విధంగా నిర్వహించడం కొంచెం బాధాకరమని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
8/ 9
కొద్ది సమయంలోనే గ్రౌండ్‌ను తీర్చిదిద్దడం కష్టమైన పనే అయినప్పటికీ అధికారులు ఇంకొంచెం ప్రత్యేక దృష్టి సాధించి క్రీడాకారుల కోసం కొన్ని మెరుగైన సేవలను అందిస్తే బాగుండేదని విద్యార్థులు చెప్తున్నారు.
9/ 9
400 మీటర్ల పరువు పందెంలో భద్రాచలం జోన్ శ్రీవల్లిక ప్రథమ స్థానం రాగం చెందిన ఎం శైలజ రెండో స్థానంలో నిలిచిందిఅండర్ 17 ఆర్చరీ బాలికల విభాగంలో భద్రాచలం జోన్ ఓవరాల్ ఛాంపియన్ గా నిలిచింది. జై సునంద ఏం కల్పన కే సాత్విక కల్పన లు సత్తా చాటారు.