MP KAVITHA TARGETS OPPOSITION PARTIES ON THE SIDELINES OF TURMERIC FARMERS PROTESTS NK
Pics : పసుపు బోర్డు కోసం పడిన కష్టం నాకు తెలుసు... ప్రతిపక్షాలపై ఎంపీ కవిత ఫైర్
Lok Sabha Elections : నిజామాబాద్ జిల్లాలో పసుపు రైతులు నామినేషన్లు వెయ్యడంతో... సిట్టింగ్ ఎంపీ కవితను టార్గెట్ చేసుకుంటున్నాయి ప్రతిపక్షాలు. ఐతే... రోడ్‌షో ఆమె ఘాటుగానే బదులిస్తున్నారు.
పసుపు బోర్డు కోసం ఎక్కని కొండ లేదు మొక్కని బండ లేదు అన్నారు నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీ కవిత. గోదూరు, వేములకుర్తి, ఇబ్రహీంపట్నం మండల కేంద్రాలలోని రోడ్ షోలలో ఆమె ప్రసంగించారు.
2/ 5
పసుపు గురించి పార్లమెంటులో మాట్లాడటమే కాదు... ప్రైవేట్ మెంబర్ బిల్లును కూడా ప్రవేశపెట్టానని కవిత తెలిపారు. పసుపు రైతుల కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్ రూ.4 లక్షల ధర ఉండే పసుపు బాయిలర్లకు రూ.2 లక్షల సబ్సిడీ ఇచ్చారని అన్నారు.
3/ 5
పసుపు రైతుల ఆవేదన తమకు అర్థమైంది కాబట్టే కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి కేంద్రంపై ఒత్తిడి తెచ్చామనీ... అయినా ప్రధాని నరేంద్ర మోదీ మనసు కరగలేదని అన్నారు కవిత.
4/ 5
నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఐదేళ్లలో రూ.15,000 కోట్ల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు చేయించానని తెలిపారు ఎంపీ కవిత.
5/ 5
బీజేపీ సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు చేస్తున్నారన్న కవిత... తాము ఇస్తున్న వెయ్యి రూపాయల పెన్షన్లలో రూ.800 కేంద్రమే ఇస్తోందని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.