రైళ్ల రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సికింద్రాబాద్-ధన్పూర్, హైదరాబాద్-షాలిపూర్ ఈస్ట్‌కోస్ట్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అలాగే హైదరాబాద్-శాలీమార్, ఉందానగర్-సికింద్రాబాద్, సికింద్రాబాద్-ఉందానగర్, సికింద్రాబాద్-రేపల్లే, షిరిడీసాయి నగర్-కాకినాడ పోర్టు, భువనేశ్వర్-ముంబై రైళ్లను అధికారులు రద్దు చేశారు.
భువనేశ్వర్-ముంబై సీఎస్టీ రైలును దారి మల్లించారు. భువనగిరి జిల్లాలోని నాగిరెడ్డిపల్లి రైల్వే స్టేషన్లో శబరి ఎక్స్‌ప్రెస్‌తోపాటు, పలు గూడ్స్ రైళ్లను నిలిపివేశారు. హావ్‌డా-సికింద్రాబాద్ రైలు, సిర్పూర్ కాగజ్‌నగర్-సికింద్రాబాద్ రైళ్లను మౌలాలిలో, గుంటూరు-వికారాబాద్ రైలును చర్లపల్లిలో నిలిపివేశారు. మరికొన్ని సర్వీసులను దారిమళ్లించారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ కు వ్యతిరేకంగా సికింద్రాబాద్‌లో ఆర్మీ అభ్యర్థులు నిరసనకు దిగారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పెద్దఎత్తున విధ్వంసానికి పాల్పడ్డారు. మూడు రైళ్లను తగులబెట్టారు. పార్సిళ్లను రైలు పట్టాలపై వేసి కాల్చివేశారు. పలు రైళ్ల అద్దాలను ధ్వంసం చేశారు. సీసీ కెమెరాలు, డిస్ప్లే బోర్డులను పగులగొట్టారు. ఫ్లాట్‌ఫామ్‌పై ఉన్న దుకాణాలను ధ్వంసం చేయడంతోపాటు లూటీ చేశారు.
దీంతో ఆదోంళనకారులను అదుపుచేయడానికి రైల్వే పోలీసులు 15 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. ఇందులో గాయపడిన ఓ యువకుడు మృతిచెందాడు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నది. మృతిచెందిన వ్యక్తిని వరంగల్ జిల్లాకు చెందిన రవిగా గుర్తించారు. ఆర్మీ రిక్రూట్మెంట్ బోర్డుకు వెళ్లి అక్కడినుంచి స్టేషన్‌కు వచ్చినట్లు గుర్తించారు.
సికింద్రాబాద్ స్టేషన్లో నిర్వహించిన ఆందోళనలతో దాదాపు రూ.20 కోట్ల మేర నష్టం జరిగిందని సౌత్‌సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ తెలిపారు. అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలోనే రైళ్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించారు. ప్రయాణిలకు కలుగుతోన్న అసౌకర్యానికి చింతితుస్తామని రైల్వే అధికారులు పేర్కొన్నారు. మళ్లీ స్టేషన్లను ఎప్పుడు తెరిచేది ప్రకటించలేదు.