బాలుడు విజయ్‌కుమార్‌ని జిల్లాకు చెందిన రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ దగ్గరుండి తన కారులోనే సాగనంపారు. రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకునేందుకు వెళ్తున్న బాలుడికి కావాల్సిన అన్నీ వస్తువులు, దుస్తులు, పుస్తకాలను స్వయంగా మంత్రే సమకూర్చారు. అతడ్ని తన సొంత బిడ్డలా దగ్గరుండి స్కూల్‌కి పంపారు మంత్రి.
సోమవారం మంత్రి క్యాంప్ కార్యాలయానికి వచ్చిన బాలుడు విజయ్‌కుమార్‌ని తన అధికారిక వాహనంలో పాఠశాలకు పంపించారు. మంత్రే స్వయంగా బాలుడిని తన కారులో ఎక్కించారు. మంత్రి ఓ పేద విద్యార్ధి కోరిన తీర్చడం కోసం చూపించిన శ్రద్ధ ఇప్పుడు అందర్ని మనసుల్ని హత్తుకునేలా చేసింది. కారులో స్కూల్‌కి వెళ్తూ బాలుడు రెండు చేతులు జోడించి మంత్రికి నమస్కారం చేయడంతో శ్రీనివాస్‌గౌడ్ సైతం సంతోషించారు.