Minister KTR: కొత్త లుక్ లో కేటీఆర్..చాలా స్టైలిష్ గా..చిల్ అవుతున్న మంత్రి
Minister KTR: కొత్త లుక్ లో కేటీఆర్..చాలా స్టైలిష్ గా..చిల్ అవుతున్న మంత్రి
దావోస్ లో కేటీఆర్ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎప్పుడూ కనిపించని స్టైలిష్ లుక్ లో ఉన్న కేటీఆర్ ఆ ఫోటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఎప్పుడూ రాజకీయాలతో బిజీగా ఉండే మంత్రి కేటీఆర్ ఈ ఫొటోల్లో మంచు పర్వతాల్లో చిల్ అవుతూ కనిపించారు.
దావోస్ లో కేటీఆర్ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎప్పుడూ కనిపించని స్టైలిష్ లుక్ లో ఉన్న కేటీఆర్ ఆ ఫోటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఎప్పుడూ రాజకీయాలతో బిజీగా ఉండే మంత్రి కేటీఆర్ ఈ ఫొటోల్లో మంచు పర్వతాల్లో చిల్ అవుతూ కనిపించారు. (PC: Twitter)
2/ 10
దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సదస్సులో కంపెనీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ భేటీలో తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పలు అంతర్జాతీయ కంపెనీలు ముందుకొచ్చాయి. (PC: Twitter)
3/ 10
గతంలో కేటీఆర్ అనేక దేశాల సదస్సులకు వెళ్లారు. కానీ దావోస్ సదస్సులో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకొచ్చారు. దీనితో మంత్రి ఆనందంతో మంచులో చిల్ అవుతున్నారని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. (PC: Twitter)
4/ 10
ఈ వరల్డ్ ఎకానమిక్ ఫోరం సదస్సులో నాలుగు రోజుల్లో ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు మంత్రి కేటీఆర్. అంతర్జాతీయ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విధంగా ఆయా కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపారు. పారిశ్రామికవేత్తలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. (PC: Twitter)
5/ 10
కేటీఆర్ నాలుగు రోజుల దావోస్ పర్యటనలో మొత్తంగా రాష్ట్రానికి 21వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినట్లుగా ఆయన స్వయంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. (PC: Twitter)
6/ 10
దావోస్లో ఏర్పాటు చేసిన 2023 ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తన బృందంతో పాల్గొన్న మంత్రి మొత్తం 52 వ్యాపార సమావేశాలు, 6 రౌండ్ టేబుల్ సమావేశాలు, 2 ప్యానెల్ చర్చలు నిర్వహించినట్టుగా ట్విట్టర్లో పేర్కొన్నారు. (PC: Twitter)
7/ 10
21వేల కోట్ల పెట్టుబడుల్లో భాగంగా గ్లోబల్ మల్టీ బ్రాండ్ రెస్టారెంట్ కంపెనీ ఇన్స్పైర్ బ్రాండ్స్ హైదరాబాద్లో తమ సపోర్ట్ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. (PC: Twitter)
8/ 10
సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ రూ. 16 వేల కోట్ల పెట్టుబడితో హైదరాబాద్లో మరో 3 డాటా సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు దావోస్ వేదికగా ప్రకటించిన విషయాన్ని ఆయన ఇప్పటికే ప్రకిటించారు. (PC: Twitter)
9/ 10
దావోస్లో జరిగిన 2023 ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో మంత్రి కేటీఆర్ పాటుగా ఐటీ, పరిశ్రమలశాఖకు సంబంధించిన ఉన్నతాధికారుల బృందం సైతం పాల్గొంది. (PC: Twitter)
10/ 10
గత కొన్నిరోజులుగా పారిశ్రామికవేత్తలతో సమావేశాలతో కేటీఆర్ బిజీగా గడిపిన మంత్రి పరిశ్రమలను తెలంగాణకు వచ్చేలా చేయడంలో పూర్తి స్థాయిలో సఫలీకృతమయ్యారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా సమావేశాలు జరిపారు. (PC: Twitter)